భారత్‌లోని బ్యాంకుల నుంచి రూ.వేల కోట్లలో అప్పులు తీసుకుని ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్తలు విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ కేసులో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. వారి నుంచి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రూ.18 వేల కోట్లు వసూలు చేసిందని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు సమాచారం ఇచ్చింది. 2002లో నగదు అక్రమ చలామణి నిరోధక చట్టం తీసుకొచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 4,700 కేసులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారించినట్టు తెలిపింది. అన్ని కేసుల్లో…
పంజాబ్ నేషనల్ బ్యాంకు స్కామ్‌లో నిందితుడిగా ఉన్న వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీకి మరోసారి ఎదురుదెబ్బ తగలింది.. పంజాబ్ నేషనల్ బ్యాంకుకు రూ.13,500 కోట్ల రుణం ఎగవేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన.. 2018లో భారత్ విడిచి పారిపోయాడు.. ఆ తర్వాత మళ్లీ తాజాగా దొరికిపోయాడు.. అయితే, బెయిల్ కోసం ఆయన చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి… చోక్సీకి బెయిల్ ఇచ్చేందుకు డొమినికా హైకోర్టు నిరాకరించింది. డొమినికాతో తనకు ఎలాంటి సంబంధాలు లేవని, దేశం విడిచి పారిపోనని ఇచ్చిన హామీని…