Meghalaya BJP leader’s farmhouse run as brothel House:మేఘాలయ బీజేపీ అధ్యక్షుడు అత్యంత నీచానికి దిగజరాడు.. బాధ్యతాయుతమైన హోదాలో ఉండీ, చిన్న పిల్లలతో బ్రోతల్ హౌజ్ నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. గతంలో మిలిటెంట్ గా ఉండీ, ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్న బెర్నార్డ్ మరాక్ తన ఫామ్ హౌజ్ లో వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్నాడు. పోలీసులు పక్కా సమాచారంతో శనివారం తురాలోని ఫామ్ హౌజ్ పై దాడి చేశారు. పోలీసులకు సమాచారం అందడంతో దాడులు నిర్వహించామని.. వెస్ట్ గారో హిల్స్ జిల్లా ఎస్పీ వివేకానంద్ సింగ్ వెల్లడించారు.
ఈ దాడిలో ఆరుగురు చిన్నారులను రెస్క్యూ చేశారు పోలీసులు. ఇందులో ఇద్దరు బాలికలు కాగా.. మరో నలుగురు బాలురు ఉన్నారు. వీరందరిని పోలీసులు చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ కు అప్పగించారు. ఈ దాడిలో మొత్తం 27 వామనాలు, 8 ద్విచక్రవాహనాలు, 400 మధ్యం సీసాలు, 500కు పైగా ఉపయోగించన కండోమ్ లను గర్భనిరోధక మాత్రలు, 47 మొబైల్ ఫోన్లు, రూ.30,000, నేరారోపణ పత్రాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఫామ్ హౌజ్ లో మొత్తం 30 గదులు ఉన్నట్లు ఎస్పీ సింగ్ వెల్లడించారు. రెస్క్యూ చేసిన ఆరుగురు చిన్నారులను అత్యంత దుర్భరమైన పరిసరాల్లో బంధించారని తెలుస్తోంది. ఈ ఘటనతో సంబంధం ఉన్న మొత్తం 73 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో 23 మంది మహిళలు ఉన్నారు. అరెస్ట్ అయిన వారిపై ఐపీసీ సెక్షన్లు, 366ఏ (మైనర్ బాలికను అపహరించడం) , 376( అత్యాచారం), ఫోక్సో చట్టాల కింద కేసులు నమోదు చేశారు.
Read Also: World Athletics Championship: చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా.. 19 ఏళ్ల తర్వాత భారత్‌కు పతకం
ఇదిలా ఉంటే మారన్ కోసం పోలీసులు వేట సాగిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఎక్కడ ఉన్నారో ఎవరీకీ తెలియదు.. అతని ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయి ఉందని పోలీసులు గుర్తించారు. తన ప్రతిష్టను దిగజార్చేందుకు ముఖ్యమంత్రి కన్రాడ్ కే సంగ్మా ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపించారు. సౌత్ తురా సీటును బీజేపీ దక్కించుకోబోతుందని అన్నారు మారక్.. దీంతోనే నన్ను సీఎం టార్గెట్ చేస్తున్నారని విమర్శించారు.