Megha Akash : టాలీవుడ్ హీరోయిన్ మేఘా ఆకాష్.. రజనీకాంత్‌తో ‘పెట్టా’ సినిమాతో తమిళ చిత్ర పరిశ్రమలో నటిగా ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంలో ఆమె కీలక పాత్ర పోషించింది.
ఇటీవల విడుదలైన ‘రాజ రాజ చోర’ విజయంతో మేఘా ఆకాష్ వెండి తెరపై ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. గతంలో ఎన్ని సినిమాలు చేసినా, రజినీకాంత్, ధనుష్, సల్మాన్ ఖాన్, నితిన్ వంటి స్టార్ హీరోలతో నటించినప్పటికీ ఆమె దశ తిరగలేదు. కానీ ‘రాజ రాజ చోర’ మాత్రం ఆమె కెరీర్ కు బిగ్ టర్న్ అని చెప్పొచ్చు. ఎంతో క్యూట్ గా ఉండే ఈ అమ్మాయికి కెరీర్ మొదటి నుంచి పెద్దగా హిట్స్ ఏమీ లేకపోయినా అవకాశాలకు…