మెగాస్టార్ చిరంజీవి మళ్ళీ సినిమా షూటింగ్ మొదలెట్టేశారు. ఇటీవలే కరోనా వైరస్ బారిన పడిన చిరంజీవికి తాజాగా నెగటివ్ అని తేలింది. కరోనా నుంచి కోలుకున్న వెంటనే చిరు తన నెక్స్ట్ సినిమాలైన “భోళా శంకర్”, “గాడ్ ఫాదర్” సెట్స్‌లో చేరాడు. ఇక తనకు నెగెటివ్ వచ్చిందన్న విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు చిరంజీవి. అంతేకాదు ఈ పోస్టుతో పాటు రాబోయే సినిమాల సెట్స్ నుండి అతని కొన్ని చిత్రాలను పోస్ట్ చేశాడు. Read Also…
తక్కువ టైమ్ లో సూపర్ క్రేజ్ తెచ్చుకోవడమే కాదు… పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు విజయ్ దేవరకొండ. తనదైన అటిట్యూడ్ తో యూత్ లో క్రేజీ స్టార్ గా గుర్తింపును సొంతం చేసుకున్నాడు. రౌడీ బ్రాండ్ తో యువత మనసు దోచిన విజయ్ సినిమా థియేటర్ బిజినెస్ లోకి కూడా అడుగు పెట్టాడు. ఇక పాన్ ఇండియా స్టార్ గా వచ్చిన గుర్తింపుతో పలు ప్రకటనల్లో దర్శనం ఇస్తున్నాడు. సోషల్ మీడియాలో యమ యాక్టీవ్ గా…
కరోనా మహమ్మారి చిత్ర పరిశ్రమను కుదిపేస్తోంది. ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు మూడు వేవ్స్ లోను సినిమా రంగాన్ని ఛిద్రం చేసింది.చిన్న సినిమాల నుంచి భారీ పాన్ ఇండియా సినిమాల వరకు కరోనా దెబ్బకు వాయిదా పడాల్సి వచ్చింది. ఇక చాలామంది నిర్మాతలు ఈ గడ్డుకాలం నుంచి తప్పించుకోవడానికి ఓటీటీ బాట పడితే కొన్ని చిత్రాలు డేర్ చేసి థియేటర్లలోకి వచ్చేస్తున్నాయి. గత కొంత కాలంగా భారీ ప్రాజెక్ట్ ల రిలీజ్ డేట్లపై సందిగ్దత నెలకొన్న…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముంబయిలో సౌకర్యవంతమైన అవుట్ ఫిట్ తో స్మార్ట్ లుక్ లో కనిపించాడు. చరణ్‌తో పాటు ఆయన సోదరి శ్రీజ, పెంపుడు కుక్క రైమ్ కూడా ఉండడం గమనార్హం. ఈ పిక్ లో చరణ్ లేత గోధుమరంగు టీ-షర్ట్‌లో దానికి మ్యాచింగ్ జాకెట్, నీలిరంగు జీన్స్ ధరించాడు. చెర్రీ పిక్ ఇప్పుడు నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. రామ్ చరణ్ తన సోదరితో కలిసి ముంబైలో ఎందుకు ఉన్నారనే విషయంపై క్లారిటీ లేదు.…
కొణిదెల అంజనా దేవి.. ఈ పేరు ఎవరికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు.. చిత్ర పరిశ్రమకు ముగ్గురు రత్నాల్లాంటి బిడ్డలను అందించింది. చరిత్ర గుర్తుంచుకొనే హీరోలను తయారుచేసింది. మెగాస్టార్ మాతృమూర్తిగా నిత్యం అందరి హృదయాల్లో కొలువున్న అమ్మ అంజనా దేవి. నేడు ఆమె పుట్టినరోజు అన్న సంగతి తెలిసిందే. అమ్మకు అపురూపంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు మెగా బ్రదర్స్. “అమ్మా! జన్మదిన శుభాకాంక్షలు. క్వరెంటైన్ అయిన కారణంగా నీ ఆశీస్సులు ప్రత్యక్షంగా తీసుకోలేక ఇలా తెలుపుతున్నా.. నీ…
మెగాస్టార్ చిరంజీవి ఇటీవల కరోనా బారిన పడ్డ సంగతి తెలిసిందే. స్వల్ప లక్షణాలతో కరోనాబారిన పడ్డ చిరు ప్రస్తుతం ఇంట్లో చికిత్స తీసుకుంటున్నారు. ఇకపోతే అపోలో వైద్యులు నిత్యం ఆయనను పరీక్షిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం చిరు ఆరోగ్యం కాస్త మెరుగుపడినట్లు తెలుస్తోంది. కాకపోతే కొద్దిగా జలుబు, ఒంటి నొప్పులు ఉన్నాయని, జ్వరం పూర్తిగా తగ్గినట్లు డాక్టర్లు తెలుపుతున్నారు. వైద్యుల సూచనలు మరియు సలహాలతో డైట్ ఫాలో అవుతూ ఆయన విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మెగా కోడలు ఉపాసన…
కరోనా మహమ్మారి థర్డ్ వేవ్ ఎవ్వరినీ వదలడం లేదు. సామాన్య ప్రజలతో పాటు ఈసారి చాలామంది సెలెబ్రిటీలు కూడా కోవిడ్ బారిన పడుతున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీకి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా మెగాస్టార్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. నిన్న రాత్రి కోవిడ్ పాజిటివ్ గా తేలిందని, స్వల్ప లక్షణాలే ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం తాను హోం క్వారంటైన్లో ఉన్నానని, కొద్దిరోజులుగా తనను కలిసిన వారందరూ టెస్టులు చేయించుకోవాలని సూచించాడు…
న్యాచురల్ స్టార్ నాని, రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. గతేడాది క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 24 న విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకొని నానికి పెద్ద హిట్ ని కట్టబెట్టింది. కోల్ కతా నేపథ్యంలో సాగే టైమ్ ట్రావెలింగ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాలో నాని సరసన సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ నటించారు. పవర్ ఫుల్ పాత్రలో నటించిన నాని నటనకు ఫ్యాన్స్ యే కాకుండా…
పొద్దున్నే ప్రముఖ దర్శకనిర్మాత రామ్ గోపాల్ వర్మ దృష్టి, స్టార్ కపుల్ ధనుష్, ఐశర్వ విడాకుల మీద పడినట్టుగా ఉంది. సహజంగా పెళ్ళంటే పడని వర్మ ఎప్పటిలానే పెళ్ళి – దాని పర్యవసానాలపై నాలుగైదు ట్వీట్స్ పెట్టేశాడు. బట్ ఆ పోస్టులు, దానికి వచ్చిన స్పందన వర్మకు పెద్దంత కిక్ ఇచ్చినట్టు లేవు. ఇక మెగా ఫ్యామిలీ మీద పడ్డాడు. ‘అంగీకరించడానికి కష్టంగా ఉన్నా ఇక ‘అల్లు’ అనేది కొత్త ‘మెగా’! అంటూ కామెంట్ పెట్టాడు. దీంతో…
మెగాస్టార్ కథనాయకుడిగా తెరకెక్కుతున్న సినిమా ఆచార్య. కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమాలో మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ కూడా నటిస్తుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఎప్పుడెప్పుడూ ఆచార్య సినిమా విడుదలవుతుందా అని ఎదురుచూస్తున్న మెగా అభిమానులకు నిరాశే మిగిలింది. కరోనా మహమ్మారి విజృంభిస్తుండడంతో ఇప్పటికే భారీ బడ్జెట్ సినిమాలు వాయిదాపడ్డాయి. రామచరణ్, ఎన్టీఆర్ నటించిన ‘ఆర్ఆర్ఆర్’, రెబల్‌స్టార్ ప్రభాస్ ‘రాధేశ్యామ్’ లాంటి పాన్ఇండియా సినిమాలు సైతం కరోనా దెబ్బకు యూటర్న్…