అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఈనెల 29న కీలక సమావేశం ఏర్పాటు చేయనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో పాకిస్థాన్‌లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్‌ను ఖరారు చేసేందుకు వర్చువల్ (ఆన్‌లైన్) సమావేశాన్ని నిర్వహించనుంది.
శ్రీకాకుళం జిల్లా టీడీపీ కార్యాలయంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం నిర్వహించారు. జిల్లా అభివృద్ధిపై వారితో చర్చించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఫ్రంట్ ఏర్పాటు చేసి కేంద్రంలో మంత్రి పదవులు తీసుకోకుండా రాష్ట్రం కోసం పనిచేసిన పార్టీ టీడీపీ అని అన్నారు. ఇప్పుడు ఎన్డీఏతో కలిసి పనిచేస్తున్నాం.. టీడీపీ ఎప్పుడు పదవుల కోసం పనిచేయలేదు.. విశ్వసనీయత కోసం పని చేస్తాం అనేది గుర్తించాలన్నారు.
చెరువులు, నాలాల పరిరక్షణతో పాటు వాటికి పునరుజ్జీవనం కల్పించేందుకు స్వచ్ఛంద సంస్థలు, లేక్‌మ్యాన్స్, జలవనరుల అభివృద్ధికి సంబంధించిన పలువురు పరిశోధకులు, నిపుణలతో హైడ్రా సమావేశాలు నిర్వహించింది. గురువారం హైడ్రా కార్యాలయంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆధ్వర్యంలో వాటర్-ఉమెన్ రైట్స్ యాక్టవిస్టు డా. మన్సీబాల్ భార్గవతో హైడ్రా బృందం సమావేశమైంది.
రేపు ఉదయం ఏపీ కేబినెట్ సమావేశం జరుగనుంది. సచివాలయంలో ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో వివిధ కీలక ప్రతిపాదనలపై రాష్ట్ర మంత్రివర్గం చర్చించనుంది.
మంగళగిరి నేతలతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంగళగిరి నియోజకవర్గంలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి.. ఈ నేపథ్యంలో పార్టీ కార్యకర్తలకు పూర్తి భరోసా ఇవ్వాలని భావించామని తెలిపారు. అధికార దుర్వినియోగంతో కార్యకర్తలకు నష్టం చేస్తున్నప్పుడు కచ్చితంగా భరోసా ఇవ్వాలి.. పార్టీ తోడుగా ఉంటుందనే విశ్వాసం కల్పించాలి.. ఆ ఉద్దేశంతోనే ఈసమావేశం ఏర్పాటు చేశాం, పార్టీ పరంగా కొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నామని అన్నారు.
Malala Meeting: నేడు ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ గుంటూరులో మాలల సదస్సు జగనుంది. కలిసి వచ్చే వ్యక్తులు, సంఘాలతో త్వరలో రాష్ట్రంలో సరికొత్త రాజకీయ పార్టీ స్థాపిస్తామని అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్ష కుమార్ ప్రకటించారు ఇదివరకే. రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీలు వర్గీకరణకు అనుకూలంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని.. త్వరలోనే విధివిధానాలు ప్రకటిస్తామని స్పష్టం చేసారు హర్ష కుమార్. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ – క్రీమీలేయర్ ను వ్యతిరేకిస్తూ గుంటూరులో సోమవారం నాడు…
వైసీపీలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యవహారం కాకరేపుతున్నాయి. హైదరాబాద్ లో మకాం వేసిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి.. ఒంగోలు వైసీపీ కార్పొరేటర్లతో సమావేశమయ్యారు. వైసీపీకి బాలినేని రాజీనామా చేస్తారని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో.. రెండు రోజుల క్రితం పార్టీ అధినేత జగన్ తో బాలినేని శ్రీనివాస రెడ్డి సమావేశమయ్యారు.
ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో వివిధ రకాల ఎలక్ట్రానిక్ కంపెనీల ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం అయ్యారు. వరదల్లో దెబ్బతిన్న ఎలక్ట్రానిక్ వస్తువులకు రిపేర్లు చేసే అంశంపై కంపెనీల ప్రతినిధులతో సీఎం చర్చలు జరుపుతున్నారు.
హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‍లో తెలంగాణ టీటీడీపీ నేతల సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశం టీడీపీ జాతీయ అధ్యక్షులు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగుతుంది. కాగా.. ఈ సమావేశంలో టీటీడీపీ ముఖ్య నేతలు, పొలిట్ బ్యూరో సభ్యులు, జనరల్ సెక్రటరీలు, అధికార ప్రతినిధులు, అనుబంధ సంఘాల నేతలు పాల్గొన్నారు.