ఈ నెల 13న ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. రాష్ట్రంలోని ప్రధాన పార్టీల అభ్యర్థులు ఫలితాలపై ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో 31వ తేదీన టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ కానున్నారు.