రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆధ్వర్యంలో మేడిగడ్డ ప్రాజెక్ట్ సందర్శనకు మంత్రులతో పాటు ఎంఐఎం, సీపీఐ ఎమ్మెల్యెలు వెళ్తున్నారు. మేడిగడ్డ ప్రాజెక్ట్ సందర్శనకు దూరంగా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు దూరంగా ఉన్నారు.
తెలంగాణలో జరిగిన అతి పెద్ద కుంభకోణం కాళేశ్వరం ప్రాజెక్ట్ అని ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. మేడిగడ్డతో పాటు సుందిళ్ల, అన్నారం డ్యామేజీలో ఉన్నాయన్నారు.
నేడు జరిగిన తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మేడిగడ్డకు అన్ని పార్టీల సభ్యులను ఆహ్వానించాం.. సభ్యులు వాస్తవాలు చూడాలన్నారు. మేడిగడ్డకు కేసీఆర్ వస్తానంటే హెలికాఫ్టర్ కూడా సిద్ధం చేస్తామన్నారు.
Kaleshwaram Project: మేడిగడ్డ బ్యారేజీ కుప్పకూలిన ఘటనపై విజిలెన్స్ విచారణకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని పలు ఇరిగేషన్ కార్యాలయాల్లో విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోవడానికి అనేక కారణాల్లో ఒకటి మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోవడం. ఈ కుంగుపాటుతో మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుకి ఉన్న మంచి పేరు కాస్తా పోయింది. దీంతో ఎన్నికల ప్రచారంలో ఈ ప్రాజెక్టు పేరు ఎత్తడానికే బీఆర్ఎస్ వెనకబడిపోయింది.
Ministers To Visits Medigadda Barrage on December 29: డిసెంబర్ 29న తెలంగాణ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు మేడిగడ్డ బ్యారేజీని సందర్శించనున్నారు. 29న ఉదయం 9 గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో మంత్రులు బయల్దేరి.. మేడిగడ్డ బ్యారేజీ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ప్రాణహిత ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టుల వివరాలు.. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం వల్ల జరిగిన లాభ, నష్టాలను గురించి మంత్రులు వివరిస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు…
Kishan Reddy: కాళేశ్వరం ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు లక్షల కోట్లు అప్పు చేసి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు అంధకార భవిష్యత్తుగా మారిందని వ్యాఖ్యానించారు.
Medigadda Barrage: కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. బ్యారేజీ పిల్లర్ల కుంగిపోవడంపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన నివేదిక సంచలనం కావడం.. కొంత రాజకీయ విమర్శలకు దారితీస్తున్న సంగతి తెలిసిందే.