Medical Seats: తెలంగాణలోని మెడికల్ కాలేజీల్లో రాష్ట్ర విద్యార్థులకు రిజర్వేషన్లపై హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. 2014 జూన్ 2 తర్వాత ఏర్పాటైన మెడికల్ కాలేజీల్లో పోటీ అథారిటీ కోటా సీట్లలో 100 శాతం తెలంగాణ విద్యార్థులకు మాత్రమే కేటాయించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది.