64 ఏళ్ల వ్యక్తికి ఎప్పుడూ కడుపులో నొప్పి కలిగింది. అతను డాక్టర్ దగ్గరకు వెళ్లాడు. పరీక్షించిన వైద్యుడికి షాక్ అయ్యాడు. నిజానికి, ఆ వ్యక్తి కడుపులో ఒక టూత్ బ్రష్ ఇరుక్కుపోయింది. అతను 12 సంవత్సరాల వయసులో అనుకోకుండా దాన్ని మింగేశాడు. 52 ఏళ్లుగా కడుపులోనే ఉంచుకున్నాడట. చైనాకు చెందిన ఈ వృద్ధుడి కడుపులో 52 సంవత్సరాలుగా టూత్ బ్రష్ ఇరుక్కుపోయింది. పరీక్షల అనంతరం.. అతనికి శస్త్రచికిత్స అవసరమని డాక్టర్ చెప్పారు. ఆ వ్యక్తి లోపల నుండి…
Rare Treatment : హైదరాబాద్‌లోని మెడికవర్ ఆసుపత్రి వైద్యులు ఓ అరుదైన శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారు. బాల్యంలో ప్రమాదవశాత్తు పురుషాంగాన్ని కోల్పోయిన సోమాలియాకు చెందిన యువకుడికి (20) వైద్యులు అత్యాధునిక పద్ధతులతో కొత్త జీవితం ఇచ్చారు. ఈ సమగ్ర చికిత్స ద్వారా అతడి చేతిపై పురుషాంగాన్ని అభివృద్ధి చేసి, తర్వాత శస్త్రచికిత్స ద్వారా తన శరీరంలోని సహజ స్థితికి అనుసంధానం చేశారు. బాల్యంలో జరిగిన ప్రమాదం చికిత్స పొందిన యువకుడికి నాలుగేళ్ల వయసులో సున్తీ (సర్జికల్ సర్కంసిజన్)…
Medical Miracle: వైద్యశాస్త్రంలోనే ఈ ఘటన అద్భుతమని చెప్పాలి. వైద్యపరంగా మరణించిన ఓ మహిళ, 24 నిమిషాల తర్వాత బతికింది. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. మరణానికి దగ్గర వెళ్లి వచ్చిన సదరు మహిళ తన అనుభవాలను పంచుకుంది. రచయిత్రి లారెన్ కెనడే గుండో కొట్టుకోవడం ఆగిపోయిన తర్వాత వైద్యపరంగా చనిపోయినట్లు ప్రకటించారు. దాదాపుగా అరగంట తర్వాత మళ్లీ ఆమెకు పునరుజ్జీవనం లభించింది.
Medical Miracle: హెచ్ఐవీ, క్యాన్సర్ తో పోరాడుతున్న ఓ రోగి రెండు వ్యాధుల నుంచి పూర్తిగా కోలుకున్నాడు. ఇలా ఒకే సమయంలో రెండు ప్రాణాంతక జబ్బులతో బాధపడే రోగిని ‘ డ్యూసెల్డార్ప్ పేషెంట్’గా వ్యవహరిస్తారు. ప్రాణాంతకమైన క్యాన్సర్ అయిన ల్యూకేమియా కోసం స్టెమ్ సెల్ చికిత్స తీసుకున్న తర్వాత సదరు రోగి క్యాన్సర్, హెచ్ఐవీ నుంచి కోలుకున్నట్లు ఓ అధ్యయనంలో తేలింది. ఇలా కోలుకున్న వ్యక్తులు ప్రపంచంలో ముగ్గురే ఉన్నారు. గతంలో బెర్లిన్, లండన్ లోని ఇద్దరు…