సామాజిక కార్యకర్త మేధా పాట్కర్‌కు మరోసారి చుక్కెదురైంది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే.సక్సేనా పరువు నష్టం కేసులో విధించిన శిక్షను రద్దు చేయాలంటూ వేసిన పిటిషన్‌ను ఢిల్లీ కోర్టు బుధవారం కొట్టేసింది. మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఇచ్చిన నిర్ణయాన్ని ఢిల్లీ కోర్టు సమర్థించింది.
సామాజిక ఉద్యమకారిణి మేధా పాట్కర్‌కు ఢిల్లీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. పరువు నష్టం దావా కేసులో ఆమెకు ఉపశమనం లభించింది. 5 నెలల జైలు శిక్షను న్యాయస్థానం సస్పెండ్ చేసి బెయిల్ మంజూరు చేసింది.
దాదాపు 24 ఏళ్ల నాటి పరువు నష్టం కేసులో ‘నర్మదా బచావో ఆందోళన్’ ఉద్యమకారిణి మేధా పాట్కర్‌కు గట్టి షాక్ తగిలింది. ఈ కేసులో ఢిల్లీ హైకోర్టు ఆమెను దోషిగా తేల్చింది. ప్రస్తుత ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఉన్న వీకే. సక్సేనా.. ఆమెపై పరువు నష్టం దావా కేసు వేశారు.