Medaram Jatara: మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు వచ్చే కోట్లాది మంది భక్తులకు వైద్యపరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు. చిన్నపాటి అనారోగ్య సమస్య వచ్చినా తక్షణం స్పందించి వైద్యం అందించేలా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ మేరకు శనివారం ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జాతర ఏర్పాట్లపై పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ రూపొందించిన ప్రణాళికను మంత్రి పరిశీలించారు. ఇప్పటికే లక్షల మంది భక్తులు…
KCR: ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో మాజీ సీఎం కేసీఆర్‌ను మంత్రులు కలవనున్నారు. మంత్రులు సీతక్క, కొండా సురేఖ కేసీఆర్‌ను మేడారం మహా జాతరకు ఆహ్వానించనున్నారు. మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతరను ఘనంగా నిర్వహించాలనే లక్ష్యంతో విపక్ష నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రముఖులను స్వయంగా కలిసి ఆహ్వానాలు అందజేస్తున్న కార్యక్రమంలో భాగంగా ఈ భేటీ జరగనుంది.