తెలంగాణ కుంభమేళగా ప్రసిద్ధిగాంచిన మేడారం మహాజాతర ముగిసింది.. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం జాతరకు భక్తులు పోటెత్తారు.. ఇక, భక్తుల నుంచి పూజలందుకున్న గిరిజన దేవతలు వనప్రవేశం చేయడంతో.. మహా జాతర ముగిసింది.. సంప్రదాయం ప్రకారం పూజలు చేసిన అనంతరం అమ్మవార్లకు వీడ్కోలు పలికారు గిరిజన పూజారాలు.. సమ్మక్క, సారలమ్మ వనప్రవేశంతో మహా జాతర ముగిసిపోయింది.. ఆదివాసీ సంప్రదాయం ప్రకారం వనదేవతలను సాగనంపారు.. చిలకలగుట్టకు సమ్మక్క, కన్నేపల్లికి సారలమ్మను చేర్చారు.. పూనుగొండ్లకు సమ్మక్క భర్త…