మంత్రి పదవి కోసం పద్మా దేవేందర్ రెడ్డి ఆరాటం !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అధికార పార్టీ ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో రాజకీయంగా ఇబ్బందులు పడుతున్నారా?సొంత పార్టీకి చెందిన నాయకుడే…ఆ ఎమ్మెల్యే ఇమేజ్‌ను డ్యామేజ్ చేసే ప్రయత్నాలు చేశారా?ఈ వ్యవహారం పార్టీ పెద్దలు దృష్టికి చేరిన తరువాత…ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి?పార్టీ ఆ ఎమ్మెల్యేకు భరోసా ఇచ్చిందా?
ఉమ్మడి మెదక్ జిల్లా టిఆర్ఎస్‌కు రాజకీయంగా కీలకమైంది. టిఆర్ఎస్‌లో ప్రారంభం నుంచి ఉన్న నేత పద్మా దేవేందర్ రెడ్డి. మెదక్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత డిప్యూటీ స్పీకర్‌గా పనిచేశారు. మంత్రి పదవి ఆశిస్తూ వస్తున్న పద్మా దేవేందర్ రెడ్డికి కాలం కలిసి రావడం లేదు. దీంతో తన నియోజకవర్గానికి పరిమితం కావడంతో పాటు పార్టీ అప్పగించిన బాధ్యతల ప్రకారం పనిచేసుకుంటూ వెళ్తున్నారు పద్మా దేవేందర్ రెడ్డి.
Also Read
ఐతే…రాజకీయంగా తన నియోజకవర్గంలో పద్మాదేవేందర్ రెడ్డి ఇబ్బందులు పడుతున్నారన్న ప్రచారం గులాభి పార్టీ వర్గాల్లో కొంత కాలంగా జరుగుతూ వస్తోంది. వచ్చే రాజకీయ ఇబ్బందులు ప్రత్యర్థి పార్టీల నుంచి కాదని తెలుస్తోంది. సొంత పార్టీకి చెందిన ఒక నేతే రాజకీయంగా పద్మా దేవేందర్ రెడ్డికి ఇబ్బందికరంగా మరారని వినికిడి. ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేకు పోటీగా…సమాంతరంగా వ్యవహారాలు నడిపించడం మొదలుపెట్టారనే వార్తలు సంచలనంగా మారాయి. ఇది మొదటి నుంచి ఉన్నప్పటికీ…ఇటీవలే అది కాస్తా పీక్ స్టేజ్‌కు చేరిందట. అది ఈ నోటా…ఆ నోటా పడి…స్వయంగా ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి దృష్టికి వెళ్లిందట. దీంతో ఇప్పటి వరకు చూస్తూ చూడనట్టు ఉన్న పద్మా దేవేందర్ రెడ్డి ఇక సైలెంట్‌గా ఉండటం నష్టం చేస్తుందని భావించి…వ్యవహారం పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లారని సమాచారం.
తన నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలను గులాబీ పార్టీ పెద్డల దృష్టికి తీసుకెళ్లిన పద్మా దేవేందర్ రెడ్డి…తన ఆవేదనను వ్యక్తం చేసారని తెలుస్తోంది. టిఆర్ఎస్ మొదటి నుంచి నియోజకవర్గానికి ఎమ్మెల్యేనే సుప్రీం అని పదేపదే స్పష్టం చేస్తూ వస్తోంది. అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీకి చెందిన నేతల జోక్యంను…ఎమ్మెల్యేలను కాదని చేయడానికి లేదని గులాబీ పార్టీ చెబుతూ వచ్చింది. ఇక పద్మా దేవేందర్ రెడ్డి వ్యవహారంలో…నియోజకవర్గంలో ఆ నేత జోక్యంపై పార్టీ అధిష్ఠానం అసంతృప్తి వ్యక్తం చేసిందని టాక్.ఇకపై మరోసారి అలాంటి పరిస్థితి రాకుండా జాగ్రత్తగా ఉండాలని కూడా ఆ నేతకు తేల్చిచెప్పిందట టిఆర్ఎస్. మొత్తానికి…తాజా పరిణామాల తర్వాత మెదక్ నియోజకవర్గంలో సాధారణ పరిస్థితులు వస్తాయో లేదో చూడాల్సిందే మరి.
తాజావార్తలు
-
Mahindra BE 07, Thar: మహీంద్రా Electric SUVలు టెస్టింగ్‌లో.. BE 07, Thar EVలో 500Km రేంజ్, అదిరిపోయే ఫీచర్లు!
-
vivo X Fold6: 200MP కెమెరా.. 6900mAh బ్యాటరీ.. vivo కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది! ఫీచర్లు అదిరిపోయాయ్
-
Nayanthara: బికినీలో నయనతార.. కానీ ఫాన్స్‌కు నిరాశే!
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
-
RaviTeja – VivekAthreya : రవితేజ ‘తులాభారం’లో తూగబోయే నటీనటులు వీరేనట
ట్రెండింగ్
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!