ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా నియంత్రణ మరియు పర్యవేక్షణ కమిషన్ (APHERMC) చేసిన కొన్ని సిఫార్సులపై మీడియాలో జరుగుతున్న ప్రచారంపై మోహన్ బాబు విశ్వవిద్యాలయం (MBU) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. యూనివర్సిటీ ప్రో-ఛాన్సలర్ మంచు విష్ణు పేరుతో విడుదల చేసిన ప్రకటనలో, యూనివర్సిటీ ఈ సిఫార్సులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రకటన ప్రకారం, APHERMC సిఫార్సులు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణలో (సబ్-జ్యుడిస్) ఉన్నాయి. ఈ అంశాన్ని పరిశీలించిన హైకోర్టు, APHERMC సిఫార్సులకు వ్యతిరేకంగా విశ్వవిద్యాలయానికి…
మంచు మనోజ్‌కు తాజాగా నోటీసులు జారీ చేశారు పోలీసులు.. తిరుపతిలోని మోహన్‌బాబు యూనివర్సిటీకి మంచు మనోజ్ వస్తారన్న సమచారంతో అప్రమత్తమైన పోలీసులు.. శాంతి భద్రతల దృష్ట్యా.. మోహన్‌బాబు యూనివర్సిటీలోకి అనుమతి లేదంటూ మనోజ్ నోటీసులు ఇచ్చారు..
మోహన్‌బాబు యూనివర్సిటీ దగ్గర భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు.. తన కుమారుడు మంచు మనోజ్.. ఎంబీయూకు వస్తారన్న సమాచారంతో పోలీసులను ఆశ్రయించారు మోహన్‌బాబు.. మోహన్ బాబు యూనివర్సిటీ వద్దకు మనోజ్ రాకూడదంటూ కోర్టు ఉత్తర్వులు ఉన్న నేపథ్యంలో.. పోలీసులకు ఆ కోర్టు ఉత్తర్తుల గురించి సమాచారం ఇచ్చారు మోహన్ బాబు..
ఇప్పటికే రేణుగుంట ఎయిర్‌పోర్ట్ చేరుకున్న మనోజ్.. మొదట తిరుపతిలోని బంధువుల నివాసానికి వెళ్లనున్నారు.. ఇక, మధ్యాహ్నం 12 గంటలకు శ్రీనివాస మంగాపురం చేరుకొని అక్కడి నుండి ర్యాలీగా.. మోహన్ బాబు యూనివర్సిటీ (MBU) క్యాంపస్‌కి బయల్దేరి.. 12:30కి MBUకి చేరుకోనున్నారు.. అక్కడి నుంచి 12:50కి నారావారిపల్లెను సందర్శించనున్నారు.. ఇక, మధ్యాహ్నం 1:30 గంటలకు జల్లికట్టు కార్యక్రమానికి హాజరై.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడబోతున్నారు..
సీనియర్ హీరో మోహన్ బాబు తన విద్యా సంస్థ శ్రీ విద్యానికేతన్ కీలక ప్రకటన చేశారు. నిన్ననే మోహన్ బాబు తనయుడు, మంచు విష్ణు తన తండ్రి ఈరోజు ఒక ముఖ్యమైన ప్రకటన చేయబోతున్నారు అంటూ అసలు విషయం చెప్పకుండా సస్పెన్స్ లో పెట్టేశారు. అయితే ఆ సస్పెన్స్ కు తెరదించారు తాజాగా మోహన్ బాబు. ‘శ్రీ విద్యానికేతన్‌లో వేసిన విత్తనాలు ఇప్పుడు కల్పవృక్షంగా మారాయి. మీ 30 సంవత్సరాల విశ్వాసం, నా జీవిత లక్ష్యం ఇప్పుడు…