సిద్దార్ధ వైద్య కళాశాలల్లో మళ్ళీ ఎంబీబీఎస్ విద్యార్థుల మాల్ ప్రాక్టీస్ కలకలం రేపింది. గత బుధవారం జనరల్ మెడిసిన్ పరీక్ష రాస్తూ పట్టుబడ్డ ముగ్గురు విద్యార్ధులు. శనివారం కమ్యూనిటీ మెడిసిన్ (పార్ట్ 1) పరీక్ష రాస్తూ ఇద్దరు విద్యార్ధులు పట్టుబడ్డారు. మాల్ ప్రాక్టీస్ కు పాల్పడిన విద్యార్దులను ఎన్నారై, నిమ్రా కళాశాల విద్యార్థులుగా గుర్తించారు. 160 మంది విద్యార్దులు పరీక్ష రాస్తుండగా ఇద్దరు పట్టుబడ్డారు. Also Read:Anupama : ఆ రెండు విషయాల్లో మాత్రం ఒత్తిడికి గురవుతా..…
ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ విద్యార్ధులు మాల్ ప్రాక్టీసులో పట్టుబడటం కలకలం రేపుతోంది.. సిద్దార్ధ వైద్య కళాశాలల్లో బుధవారం జరిగిన సప్లిమెంటరీ పరీక్షల్లో ముగ్గురు విద్యార్థులు స్లిప్పులు పెట్టారన్న సమాచారం రావటంతో ఎన్టీఆర్ యునివర్సిటీ అధికారులు తనిఖీలు చేశారు..