గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎంపిక టీడీపీ, వైసీపీల్లో హైటెన్షన్ పుట్టిస్తుంది.. నిన్నటివరకూ ఏకపక్షమే అనుకున్న మేయర్ ఎన్నికల్లోకి వైసీపీ అనుహ్యంగా ఎంట్రీ ఇవ్వడంతో టీడీపీ నేతలు ఎలర్ట్ అయ్యారు.. మరోవైపు కూటమి అభ్యర్దిగా టీడీపీ ఫ్లోర్ లీడర్ కోవెలమూడి రవీంద్ర నామినేషన్ దాఖలు చేశారు.. మేయర్ ఎన్నికపై వైసీపీ విప్ జారీ చేసింది.
అధికారాన్ని అడ్డంపెట్టుకుని ఏదైనా చేయొచ్చని. తిమ్మిని బమ్మిని చేసి అడ్డదారుల్లో వెళ్లే ఆఫీసర్స్‌కు దేశ సర్వోన్నత న్యాయస్థానం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇటీవల చండీగఢ్ మేయర్ ఎన్నిక సందర్భంగా రిటర్నింగ్ అధికారి చేసిన పనికి సుప్రీంకోర్టు (Supreme Court) గట్టిగానే చీవాట్లు పెట్టింది.