సార్వత్రిక ఎన్నికల ముందు ఇండియా కూటమికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. చంఢీగఢ్‌లో జరిగిన మేయర్ ఎన్నికల్లో ఊహించని పరిణామం ఎదురైంది. తొలిపోరులోనే కూటమి చతికిలపడింది. కూటమి పార్టీలైన కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ కలిసి తొలిసారి చంఢీగఢ్ మేయర్ ఎన్నికల్లో పోటీ చేశాయి. ఈ కూటమికే ఎక్కువ కార్పొరేటర్లు ఉన్నారు. అయినా కూడా ఓటమి చవిచూడాల్సి వచ్చింది. అనూహ్యంగా బీజేపీకి చెందిన మనోజ్ సొంకార్ మేయర్‌గా విజయం సాధించారు.