భారత జట్టు క్రికెటర్ మయాంక్ అగర్వాల్ ఇటీవల తన తండ్రితో కలిసి ఉత్తరప్రదేశ్‌లోని మహాకుంభ మేళాకు వెళ్లారు. ఈ సందర్భంగా.. మయాంక్ స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ఈ స్మరణీయ ప్రయాణాన్ని పంచుకున్నారు. ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు మహాకుంభ మేళా సందర్భంగా ప్రయాగ్‌రాజ్ చేరుకుంటున్నారు. ఈ సందర్భంగా మయాంక్ కూడా కుంభమేళాలో పాల్గొని.. తన విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ, ప్రత్యేకమైన భక్తిని చాటుకున్నాడు.