14 ఏళ్ల తర్వాత గ్వాలియర్‌లో బంగ్లాదేశ్-భారత్‌ల మధ్య అంతర్జాతీయ టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో.. ఇప్పటికే నిరసనలు మొదలయ్యాయి. గ్వాలియర్‌లో భారత్-బంగ్లాదేశ్ మధ్య అంతర్జాతీయ మ్యాచ్‌ను నిర్వహించేందుకు అనుమతించబోమని హిందూ మహాసభ ప్రకటించింది. గ్వాలియర్ వీధుల్లో నిరసనలు తెలుపుతూ స్టేడియంలోని పిచ్‌ను తవ్వుతామన్నారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై ఊచకోతకు పాల్పడుతున్నారని హిందూ మహాసభ పేర్కొంది. హిందువుల ఇళ్లు, దేవాలయాలకు నిప్పు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీ20 వరల్డ్ కప్కు సరిగ్గా నెల సమయం కూడా లేదు. ఐపీఎల్ అయిపోయిన వెంటనే.. ఈ మెగా టోర్నీ ప్రారంభంకానుంది. అమెరికా, వెస్టిండీస్ ఆతిధ్యమిస్తున్న టీ20 వరల్డ్ కప్.. జూన్ 2 నుంచి ప్రారంభం కానుంది. ఐపీఎల్ ను ఏంచక్కా ఎంజాయ్ చేస్తున్న క్రికెట్ అభిమానులకు.. మరో పండగ ప్రారంభం కానుంది. అయితే.. ఈ మెగా టోర్నీని చూసేందుకు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ బంపర్ ఆఫర్ ప్రకటించింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 17వ సీజన్ ఈ నెల 21న ప్రారంభమైన విషయం తెలిసిందే.. ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లు జరిగాయి. లోక్‌సభ ఎన్నికల కారణంగా తొలి 21 మ్యాచ్‌ల షెడ్యూల్ మాత్రమే విడుదలైంది. ఈ నేపథ్యంలో మిగిలిన మ్యాచ్‌ల షెడ్యూల్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో.. బీసీసీఐ (BCCI) ఐపీఎల్ 2024 మిగిలిన మ్యాచ్‌ల షెడ్యూల్‌ను తాజాగా విడుదల చేసింద
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ తదుపరి సీజన్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అయితే WPL 2024 గురించి కొన్ని వార్తలు వినపడుతున్నాయి. మీడియాలో వస్తున్న తాజా నివేదికల ప్రకారం.. వచ్చే ఏడాది WPL 2024 సీజన్‌ను ఇండియాలోని రెండు నగరాల్లో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఆ నగరాల్లో ముంబై, బెంగళూరు ఉన్నాయి. అంతేకాకుండా.. ఐపీఎల్ తరహాలోనే డబ్ల్యుపీఎల్ సీజన్ నిర్వహించనున్నట్లు నివేదికలు వచ్చాయి.
వన్డే ప్రపంచ కప్ 2023 మహా సంగ్రామం మరో మూడు రోజుల్లో ప్రారంభం కానుంది. అక్టోబర్ 5న అంటే గురువారం నుండి మొదలవుతుంది. స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ద్వారా వరల్డ్ కప్‌లోని అన్ని మ్యాచ్‌లు ఇండియాలో టీవీలో ప్రత్యక్ష ప్రసారం చేయబడతాయి. అంతేకాకుండా.. డిస్నీ+ హాట్‌స్టార్‌లో మ్యాచ్‌ల ఉచిత ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది.