ఈనెల 14న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరుగనున్న సంగతి తెలిసిందే. అయితే అందుకోసం హైసెక్యూరిటీని ఏర్పాటు చేయనున్నారు. గుజరాత్ పోలీసులు, ఎన్‌ఎస్‌జి, ఆర్‌ఎఎఫ్, హోంగార్డులతో సహా వివిధ ఏజెన్సీలకు చెందిన 11,000 మందికి పైగా సిబ్బందిని మోహరిస్తారని ఓ సీనియర్ అధికారి తెలిపారు.
రేపు( మంగళవారం) ఆసియా క్రీడలు 2023లో భాగంగా.. భారత్-నేపాల్ మధ్య క్వార్టర్-ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. హాంగ్‌జౌలోని పింగ్‌ఫెంగ్ క్యాంపస్ క్రికెట్ గ్రౌండ్‌లో మ్యాచ్ జరుగనుంది. ఈ టోర్నీలో తొలిసారిగా రుతురాజ్ గైక్వాడ్ భారత్ కు సారథ్య బాధ్యతలు చేపట్టనున్నాడు. అయితే ఆసియా క్రీడల్లో ఆడేందుకు భారత జట్టులో చాలా మంది యువ ఆటగాళ్లకు చోటు దక్కింది.
బంగ్లాదేశ్లో జరుగుతున్న సెలబ్రిటీ క్రికెట్ టీమ్ టోర్నమెంట్‌లో గ్రూప్ స్టేజ్ మ్యాచ్ సందర్భంగా.. అంపైర్ నిర్ణయంపై చిత్ర నిర్మాత ముస్తఫా కమల్ రాజ్, దీపాంకర్ దీపన్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ గొడవ తీవ్రస్థాయికి చేరడంతో ఘర్షణకు దారితీసింది. ఆ తర్వాత రెండు జట్లలోని కొంతమంది ఆటగాళ్ళు, ఇతర వ్యక్తులు వచ్చి ఒకరితో ఒకరు గొడవపడ్డారు. కొంతమంది బ్యాట్‌లతో దాడి కూడా చేసుకున్నారు.
వన్డేలలో భారత్ అత్యధిక స్కోర్లు నమోదుచేసింది. ఇంతకుముందు టీమిండియా.. 2011లో వెస్టిండీస్ పై 418 పరుగులు చేసింది. 2009లో శ్రీలంకపై 414 పరుగులు, 2007లో బెరుమాడపై 413, 2002లో బంగ్లాదేశ్ పై 409, 2014లో శ్రీలంకపై 404, 2010లో సౌతాఫ్రికాపై 401 పరుగులు చేసింది. అయితే ఈరోజు జరిగే మ్యాచ్ లో మళ్లీ అత్యధిక పరుగుల దిశగా భారత్ దూసుకెళ్తుంది.
ఆసియా కప్ లో భాగంగా సూపర్-4లో భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ తిరిగి ప్రారంభమైంది. అనుకున్న సమయం కంటే గంటకు పైగా ఆలస్యంగా ప్రారంభమైంది. నిన్న 24.1 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన టీమిండియా.. రెండో రోజు అక్కడి నుంచే బ్యాటింగ్ మొదలెట్టింది. నిన్న మ్యాచ్ నిలిచిపోయే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసిన టీమిండియా.. ఇవాళ కూడా దూకుడుగా ఆటను ప్రారంభించారు.
రేపు(శనివారం) శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ బంగ్లాదేశ్‌కు ‘డూ ఆర్ డై’ లాంటిది. శ్రీలంకపై బంగ్లాదేశ్ ఓడిపోతే.. నిష్క్రమించడం దాదాపు ఖాయం.
ఐపీఎల్ 2022లో కోల్ కతాకు రిలీఫ్ లభించింది. వరుసగా ఎదురైన పరాజయాలకు బ్రేక్ పడింది. ఐదు వరుస పరాజయాల తర్వాత ఆ జట్టును గెలుపు వరించింది. సోమవారం రాత్రి రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించి నాలుగో విజయాన్ని నమోదుచేసుకుంది. తొలుత రాజస్థాన్‌ను 152 పరుగులకు కట్టడి చేసిన కేకేఆర్ ఆ తర్వాత మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి మరో 5 బంతులు మిగిలి ఉండగానే గెలుపు బావుటా ఎగరేసింది. తొలుత…