వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా ఈ రోజు 23వ మ్యాచ్ దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ మధ్య జరగనుంది. ముంబైలోని వాంఖడే వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది.
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో మరోసారి అత్యధిక వ్యూయర్ షిప్ నమోదైంది. మొన్న పాకిస్తాన్- ఇండియా మ్యాచ్ లో అత్యధికంగా 3.5 కోట్ల మంది వీక్షించగా, తాజాగా జరిగే న్యూజిలాండ్ మ్యాచ్ లో 4 కోట్లు వ్యూయర్ షిప్ దాటింది.
ప్రపంచకప్ 2023లో భాగంగా నిన్న(శుక్రవారం) బెంగళూరులోని చినస్వామి స్టేడియంలో ఆస్ట్రేలియా-పాకిస్థాన్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ పై ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. 62 పరుగుల తేడాలో ఆసీస్ గెలుపొందింది. అయితే ఈ మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఊహించని పరిణామం చోటు చేసుకుంది. రెండు గంటలపాటు విద్యుత్ పోవడంతో డెసిషన్ రివ్యూ సిస్టమ్ (డీఆర్ఎస్)పని చేయలేదు. పాకిస్థాన్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఈ పరిస్థితి ఏర్పడింది.
పూణేలో ఇండియా-బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లా.. ఇండియాను ఫీల్డింగ్ కు ఆహ్వానించింది. ఈ క్రమంలో టీమిండియా వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ ఓ స్టన్నింగ్ క్యాచ్ పట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ వేసిన బంతికి వికెట్ కీపర్ ఈ అద్భుత క్యాచ్ పట్టాడు. సిరాజ్ 24వ ఓవర్ తొలి బంతిని క్రాస్ సీమ్ నుండి లెగ్ సైడ్ వైపు వేశాడు. దానిని బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్…
ఈ వరల్డ్ కప్ లోనైనా పాకిస్తాన్ గెలవాలనే కసితో దిగినప్పటికీ.. 8వ సారి ఇండియా చేతిలో ఓటమిపాలైంది. మరోసారి పాకిస్థాన్పై టీమిండియా అద్భుతం చేసి చూపించిందని గంభీర్ తెలిపాడు. ఈ మ్యాచ్ లో టీమిండియా ఆల్ రౌండ్ ప్రదర్శన చూపించిందని గంభీర్ పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే.. ఇండియా-పాక్ ఈ టీమ్స్ ఎప్పుడు ఆడినా హోరాహోరీగా తలపడతాయని.. గెలుపు కోసం చివరి వరకు పోరాడతాయన్నాడు.
క్రికెట్ ఫ్యాన్స్ కు బీసీసీఐ గుడ్ న్యూస్ అందించింది. వైజాగ్లో మరో ఇంటర్నేషనల్ మ్యాచ్ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ ఏడాదిలో మూడోసారి ACA-VDCA స్టేడియం ఆదిత్యం ఇవ్వనుంది. వచ్చే నెల 23న ఇండియా- ఆస్ట్రేలియా మధ్య మొదటి టీ–20 ఇంటర్నేషనల్ మ్యాచ్ జరగనుంది.
వరల్డ్ కప్ 2023లో భాగంగా.. మొన్న ఇండియాతో జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ చిత్తుగా ఓడిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఓటమిని ఇంకా దిగమింగుకోక ముందే.. ఆ జట్టుకు భారీ షాక్ తగిలింది. పాకిస్తాన్ జట్టులో కొందరు ఆటగాళ్లు వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారు. పాక్ స్టార్ బౌలర్ షాహీన్ అఫ్రిది, అబ్దుల్లా షఫీక్, జమాన్ ఖాన్, ఉసామా మీర్ వంటి ప్లేయర్లు ఉన్నారు.
ధర్మశాలలో వర్షం కారణంగా నెదర్లాండ్స్ వర్సెస్ సౌతాఫ్రికా మ్యాచ్ ఆలస్యం అయింది. అంతకుముందు వర్షం కారణంగా టాస్ కూడా ఆలస్యమైంది. ఎట్టకేలకు కొంతసేపు విరామం ఇవ్వడంతో టాస్ వేశారు. అందులో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ దిగే సమయానికే మళ్లీ వర్షం కురుస్తుండటంతో ఆట మరింత ఆలస్యమయ్యేలా ఉంది.
వరల్డ్ కప్ 2023లో భాగంగా.. ఆస్ట్రేలియా-శ్రీలంక మధ్య మ్యాచ్ ఈ రోజు లక్నోలో జరుగుతుంది. అయితే మ్యాచ్ మధ్యలో భారీ వర్షం, తుపాన్ వచ్చింది. దీంతో గాలిదుమారానికి స్టేడియంలోని ఓ భారీ బోర్డు ఊడి ప్రేక్షకులు కూర్చునే సీట్ల మధ్య పడిపోయింది. అయితే అది ఊడిపడిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
పంచకప్ క్రికెట్ మ్యాచ్ లో భారత్-పాకిస్థాన్ పై ఘనవిజయం సాధించడం సంతోషకరమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ అన్నారు. దేశభక్తులు, క్రికెట్ అభిమానులు ఈ మ్యాచ్ కోసం ఉత్కంఠగా ఎదురు చూశారని తెలిపారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా మ్యాచ్ చూసారన్నారు. ఇంతటి ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో ఇండియా విజయం సాధించడం సంతోషమని.. ఈ విజయంతో దేశం అంతా సంబరాలు చేసుకుంటున్నారని తెలిపారు. కొంతమంది మూర్ఖులు పాకిస్తాన్ ఓడిందని…