Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో మరోసారి కార్మికులు ధర్నాకు దిగారు.. దీంతో, విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్టీల్ ప్లాంట్ అడ్మిన్ బిల్డింగ్ ఎదుట కార్మికులు భారీ స్థాయిలో మహా ధర్నా చేపట్టారు. కార్మికుల వేతనాలను ఉత్పత్తి ఆధారంగా చెల్లించాలన్న సర్క్యులర్‌ను వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అలాగే, ఇటీవల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేశారు. Read Also: Saudi Bus…
పంజాబ్-హర్యానా సరిహద్దు శంభు దగ్గర అన్నదాతలు చేస్తున్న ఆందోళనకు ప్రముఖ రెజ్లర్ వినేష్ ఫోగట్ మద్దతు తెలిపారు. కర్షకుల నిరసనలకు ఆమె సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా రైతులు వినేష్ ఫోగట్‌ను పూలమాలతో సత్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మీ కుమార్తె.. మీకు అండగా ఉంటుందని ప్రకటించారు.
రాజస్థాన్ ఆరోగ్య హక్కు బిల్లుకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న ప్రైవేట్ వైద్యులు సోమవారం జైపూర్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్‌ఎంఎస్ హాస్పిటల్‌లోని రెసిడెంట్ డాక్టర్స్ హాస్టల్ గ్రౌండ్ నుంచి ప్రారంభమైన ర్యాలీలో వేలాది మంది వైద్యులు, వారి కుటుంబ సభ్యులు, మెడికల్ షాపు యజమానులతో పాటు వైద్యవృత్తితో సంబంధం ఉన్నవారు పాల్గొన్నారు.
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప నివాసం, కార్యాలయంపై రాళ్లదాడి జరిగింది. భారీ ఎత్తున జనాలు గుమిగూడి, ఆయన ఇల్లు, కార్యాలయంపై రాళ్లు విసిరారు. సోమవారం మధ్యాహ్నం శివమొగ్గ జిల్లాలోని షికారిపురలో ఆయన నివాసం వద్ద ఈ ఘటన జరిగింది.