చైనాలోని కూరగాయల మార్కెట్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందగా.. 15 మందికి గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. సమీపంలో పొగలు పెద్ద ఎత్తున వ్యాపించాయి.
ఘజియాబాద్లోని పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న కెమికల్ ఫ్యాక్టరీలో శనివారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరగడంతో ఆ ప్రాంతంలో గందరగోళం నెలకొంది. చాలా దూరం వరకు భారీగా పొగలు అలుముకున్నాయి. స్థానిక అగ్నిమాపక శాఖ అనేక అగ్నిమాపక వాహనాలను సంఘటనా స్థలానికి తరలించి మంటలను ఆర్పేందుకు చర్యలు చేపట్టింది.
గత వారం గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో జరిగిన ఘోరం కళ్లముందు ఇంకా మెదిలాడుతోంది. గేమ్ జోన్ తగలబడి దాదాపు పిల్లలతో సహా 27 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో గుజరాత్ సహా దేశ వ్యాప్తంగా అందరూ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఉత్తరప్రదేశ్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఘజియాబాద్‌లోని హౌసింగ్ కాంప్లెక్స్‌లో జనరేటర్ పేలడంతో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో 4 ఫ్లాట్‌లు దగ్ధమయ్యాయి.
నోయిడాలో భారీ అగ్రిప్రమాదం సంభవించింది. సెక్టర్ 18లో గ్రావిటీ మంత్ర రెస్టారెంట్‌లో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు.
రంగారెడ్డి జిల్లా గండిపేట్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ కార్లలో గోదాంలో మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. దీంతో సమీప ప్రాంతాలు నల్లటి పొగతో దట్టంగా కమ్ముకున్నాయి.
ముంబై మలాడ్ ఈస్ట్‌లోని వర్దమాన్ గార్మెంట్ షాపులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని 8 ఫైరింజన్లతో మంటలార్పుతున్నారు.
మహారాష్ట్రలోని నాసిక్‌లో ఓ ప్రైవేటు ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో కార్మికులు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు.