నోయిడాలో భారీ అగ్రిప్రమాదం సంభవించింది. సెక్టర్ 18లో గ్రావిటీ మంత్ర రెస్టారెంట్‌లో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎవరికైనా గాయాలయ్యాయా? ఎంత నష్టం జరిగింది అనేది ఇంకా తెలియలేదు. ప్రస్తుతం ఫైరింజన్లు మంటలను అదుపు చేస్తున్నాయి.