డిసెంబర్ 2024లో అత్యధికంగా అమ్ముడైన కార్ల జాబితా వెల్లడైంది. ఈ జాబితాలో మరోసారి మారుతీ సుజుకీ కార్ల ఆధిపత్యం కనిపించింది. మారుతీ సుజుకీకి చెందిన బ్రెజ్జా డిసెంబర్ 2024లో 17,336 యూనిట్లు అమ్ముడైంది. భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా అవతరించింది! స్విఫ్ట్, ఎర్టిగా, వ్యాగన్‌ఆర్ వంటి కార్లను వెనక్కి నెట్టేసింది. అయితే.. డిసెంబర్ లో విక్రయించిన టాప్ 5 మోడల్‌లు 15వేల మార్కును దాటాయి. వీటిలో తేడా చాలా తక్కువగా ఉంది.
ఈ నెలతో 2024 ముగిసి పోయి.. కొత్త సంవత్సరం ప్రారంభం కానుంది. కొత్త సంవత్సరంలో చాలా వాహన తయారీ సంస్థలు తమ కార్లు, బైక్‌ల ధరలను పెంచబోతున్నాయి. దేశంలోని అతిపెద్ద కార్ల కంపెనీల్లో ఒకటైన మారుతీ సుజుకీ కూడా తమ వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. జనవరి 2025 నుంచి కార్ల ధరలు నాలుగు శాతం వరకు పెరగవచ్చని మారుతీ పత్రికా ప్రకటన విడుదల చేసింది. కార్ మోడల్‌లను బట్టి మారుతి కార్ల ధరలో పెరుగుదల మారవచ్చు.
Maruti Suzuki: భారతదేశపు అతిపెద్ద కార్ కంపెనీ మారుతీ సుజుకి కొత్త మారుతి సుజుకి విజన్ 3.0ని ప్రకటించింది. 2031 ఆర్థిక సంవత్సరం నాటికి 1.5 మిలియన్ ఎలక్ట్రిక్ కార్లను తయారు చేయాలని కంపెనీ యోచిస్తోంది.
Maruti Suzuki Jimny: మారుతీ సుజుకీ నుంచి ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతోంది జిమ్నీ. ఇప్పటికే ఈ ఆఫ్ రోడర్ కార్ పై చాలా ఆసక్తి నెలకొంది. దీనికి అనుగుణంగానే భారీ సంఖ్యలో బుకింగ్స్ కూడా జరిగాయి. ఇది జూన్ 5న ఇండియన్ మార్కెట్ లో లాంచ్ కాబోతోంది. మారుతి సుజుకీ నెక్సా అవుట్ లెట్స్ లో జిమ్నీ అమ్మకాలు జరుగుతాయి. ప్రస్తుతం జిమ్నీ మార్కెట్ లోని మహీంద్రా థార్, ఫోర్స్ గుర్ఖా కార్లకు పోటీ ఇవ్వనుంది.
భారతదేశపు నెంబర్ వన్ కార్ కంపెనీగా ఉన్న మారుతి సుజుకి తన బాలెనో RS కార్లను రీకాల్ చేస్తోంది. సుజుకి అమ్మిన వాటిలో కొన్ని మరమ్మతులకు గురైనట్లు తయారీదారు గుర్తించారు. మెర్సిడెస్ బెంజ్ వంటి లగ్జరీ కార్ల తయారీ సంస్థలు కూడా తమ కార్లను విక్రయించిన తర్వాత వాటిని రీకాల్ చేశాయి.