ఆంధ్రప్రదేశ్‌కి చెందిన మరో యువకుడు అమెరికాలో మృతిచెందాడు.. ఎనిమిది నెలలుగా బోస్టన్ లో ఉద్యోగం చేస్తున్న మార్టూరుకు చెందిన యువకుడు పాటిబండ్ల లోకేష్.. బోస్టన్ సిటీలో ఈతకొలనులో పడి మృతిచెందాడు..
బాపట్ల జిల్లా మార్టూరులో పలు గ్రానైట్ ఫ్యాక్టరీలపై విజిలెన్స్, మైనింగ్, లీగల్ మెట్రాలజీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో.. సమాచారం తెలుసుకుని పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు గ్రానైట్ ఫ్యాక్టరీల వద్దకు చేరుకుని అధికారులను నిలదీశారు. సెర్చింగ్ ఆర్డర్స్ లేకుండా, డిప్యూటేషన్ లేకుండా నెల్లూరు మైనింగ్ ఏడీ మార్టూరులో ఎలా తనిఖీలు చేస్తారని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ప్రశ్నించారు. మైనింగ్ డైరెక్టర్ చెబితే వెంటనే దాడులు చేస్తారా అంటూ ఎమ్మెల్యే అధికారులను నిలదీశారు.