ఏసీబీ అధికారులంటే టక్ చేసుకుని, హుందాగా ప్రభుత్వ కార్యాలయాల్లోని అవినీతి అధికారుల భరతం పడతారు. కానీ ఆ అధికారులు మాత్రం రొటీన్ కి భిన్నంగా వ్యవహరించారు. అవినీతి అధికారుల గుండెల్లో రైళ్ళు పరిగెత్తించారు. జస్ట్ ఫర్ ఏ ఛేంజ్ అంటూ రైతుల వేషంలో లుంగీలతో మార్కెట్ యార్డులోకి ఎంటరయ్యారు. అక్కడ జరుగుతున్న తంతు అంతా స్కాన్ చేశారు. ఆ తర్వాత రికార్డులు, నగదును పట్టుకోవడంతో వచ్చింది ఎవరనేది వారికి అర్థమయింది. అనంతపురం మార్కెట్ యార్డులోకి ముగ్గురు వ్యక్తులు…