కిచెన్లో ఉల్లిపాయలు, టమోటా లేకుంటే రోజు గడవదు. ఉల్లిపాయలు ప్రస్తుతం అందుబాటులో వున్నాయి. కిలో 20 రూపాయల లోపే లభిస్తున్నాయి. ఇక నిత్యం కూరల్లో వాడే టమోటా ధర మాత్రం ఆకాశానికి చేరింది. అక్కడినించి దిగనంటోంది. తిరుపతిలో మరింతగా పెరిగింది టమోటా ధర. మదనపల్లె మార్కెట్లో రూ.70కి చేరింది కేజీ టమోటా ధర. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తుండగా వినియోగదారులు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం వచ్చిందంటే చాలు టమోటాల వినియోగం ఎక్కువగా వుంటుంది.…
అమ్మబోతే అడవి… కొనబోతే కొరివి అన్నట్టుగా తయారైంది కొబ్బరి రైతుల దుస్థితి. కన్నకొడుకు ఆదుకున్న లేకపోయినా కొబ్బరి చెట్టు ఆదుకొంటుందని కోనసీమ వాసుల నమ్మకం. కొబ్బరి చెట్టును కల్పతరువుగా పూజిస్తారు కోనసీమ వాసులు . కొబ్బరి ఉత్పత్తుల పేరు చెబితే గుర్తొచ్చేది కేరళ తరువాత కోనసీమ కొబ్బరి మాత్రమే. గత కొన్ని ఏళ్లుగా కోనసీమ కొబ్బరి రైతులు దిగుబడి లేక నల్లి తెగుళ్ల వల్ల ఉత్పత్తి తగ్గిపోయి ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొంటున్నారు. వాతావరణంలో మార్పుల వలన…