టమోటా రైతులకు ఎప్పుడు గిట్టుబాటు ధర దొరుకుతుందో.. ఎప్పుడు వ్యాపారులు అడ్డంగా ముంచేస్తారో తెలీని పరిస్థితి. ఇటీవలహోల్ సేల్ వ్యాపారులు కుమ్మక్కై తక్కువ ధరకు తీసుకొని చిరు వ్యాపారస్తులకు అధిక ధరలకు అమ్మి సొమ్ము చేసుకునేవారు. అమ్మిన టమోటో గిట్టుబాటు ధర లేకపోవడంతో కిలో టమోటా 2 రూపాయలకు ధర పడిపోవడంతో రైతులు గత కొద్ది రోజుల నుండి లబోదిబోమన్నారు. తాజాగా కర్నూలు జిల్లా పత్తికొండ లో టమోటా సీజన్ మొదలైంది. ఈ మార్కెట్ టమోటా కు పెట్టింది పేరు. టమోటా పంట పత్తికొండ ప్రాంతంలో ఎక్కువగా సాగు చేస్తారు .ఓ రైతుకు 4 ఎకరాల పొలం ఉంటే అందులో 3 ఎకరాల విస్తీర్ణంలో టమోటా పంటనే సాగు చేస్తారు రైతులు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మదనపల్లి తర్వాత అతిపెద్ద మార్కెట్ పత్తికొండ టమాటా మార్కెట్ . ఈ మార్కెట్ పత్తికొండ నియోజకవర్గంలోని తుగ్గలి, మద్దికేర ,ఆలూరు, ఆస్పరి, మండలాల నుండి పత్తికొండ మార్కెట్ కు టమోటా రైతులు పెద్ద ఎత్తున టమోటాలు తీసుకువస్తారు. పోయిన ఏడాది టమోటా కు మంచి ధరలు ఉండడంతో ఈసారి పత్తికొండ దేవనకొండ, మద్దికేర , తుగ్గలి ,మండలాల్లో ఎక్కువగా టమోటా పంట సాగు చేశారు. పత్తికొండ వ్యవసాయ మార్కెట్ నుండి వ్యాపారస్తులు రైతుల నుండి టమోటా కొనుగోలు ప్రారంభం కావడంతో జత బాక్స్ 200 నుండి 400 పలకడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
టమోటా పంట చేతికి వచ్చిన కోసి విక్రయిద్దాం అనుకుంటే అడిగిన నాథుడే లేని సమయంలో పత్తికొండ టమోటా మార్కెట్ ప్రారంభం కావడంతో వ్యాపారస్తులు రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తున్నారని ఆశాజనకమైన ధర లభిస్తుందని రైతులు అంటున్నారు. టమోటా రైతులు టమోటాలను అక్కడి నుంచి గ్రేడింగ్ చేసుకొని మార్కెట్ కు తీసుకొని వస్తే మంచి రేటు లభిస్తుందని వ్యాపారులు అంటున్నారు. ఈ రోజే మార్కెట్ ప్రారంభం కావడంతో పది టన్నుల సరుకు మార్కెట్ కు వచ్చిందని ఈ సరుకును తెలంగాణ మహారాష్ట్రకు పంపిస్తున్నామని వ్యాపారులు అంటున్నారు. పత్తికొండ వ్యవసాయ మార్కెట్లో టమోటా రైతులకు వ్యవసాయ అధికారులు సౌకర్యాలు కల్పించాలని రైతులకు గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
Read Also: Nagendra Babu: అన్న, తమ్ముడిని విమర్శిస్తే తాట తీస్తా..! నాగబాబు మాస్ వార్నింగ్