ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ ఉపయోగించే వారిలో చాలా మంది ఫేస్‌బుక్‌ను వాడుతున్నారు. అయితే ఎంతో క్రేజ్ సొంతం చేసుకున్న ఫేస్‌బుక్‌లో కీలకమార్పులు జరగబోతున్నాయి. బ్లూరంగులో కనిపించే ఫేస్‌బుక్ టికర్ ఇకపై కనిపించదు. దాని స్థానంలో మెటా టికర్, లోగోను త్వరలో తీసుకురాబోతున్నామని మార్క్ జుకర్‌బర్గ్ ప్రకటించారు. ఆ టికర్‌తోనే ట్రేడింగ్ చేస్తామని అమెరికా స్టాక్‌మార్కెట్ నాస్‌డాక్‌కు తెలిపారు. 2004లో మార్క్ జుకర్‌బర్గ్ ఫేస్‌బుక్‌ను ప్రారంభించగా 2012లో పబ్లిక్ ఇష్యూకి వెళ్లింది. ఆ సమయంలోనే ఫేస్‌బుక్‌కు చెందిన టికర్, లోగోనూ…
ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టా..! ఈ మూడు సోషల్ మీడియా యాప్స్ మన జీవితంలో భాగమైపోయాయి. ఉదయం నిద్రలేచింది మొదలు, రాత్రి నిద్రపోయే వరకూ వాటితోనే కాలక్షేపం. అన్ని అప్డేట్స్ అందులోనే చూసి తెలుసుకుంటున్నాం..! ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది యాక్టీవ్ యూజర్లు ఉన్నారు. ఐతే సోషల్ మీడియా వాడకం ఎక్కువయ్యాక… వివాదాలు మొదలయ్యాయి. ఫేక్‌న్యూస్‌పై జూకర్‌బర్గ్ విచారణ ఎదుర్కోవాల్సి వచ్చింది. వాట్సాప్, ఇన్‌స్టాలకు కూడా ఫేస్‌బుక్ పేరెంట్ కంపెనీలా ఉంది. దాంతో వివాదాలతో ఫేస్‌బుక్ ప్రతిష్ట దిగజారుతుందని…
ప్రపంచంలో కోట్ల మంది ప్రజలు సోషల్ మీడియాను వాడుతున్నారు. అందులో ఫేస్‌బుక్ ఒకటి. చాలా మంది తమ అభిప్రాయాలను ఇతరులతో షేర్ చేసుకోవడానికి ఫేస్ బుక్‌ను ఉపయోగిస్తుంటారు. కొందరు దీని ద్వారా వ్యాపారాలు కూడా చేసుకుంటున్నారు. ఇటీవల ఫేస్‌బుక్ సేవలు ఆరు గంటలు నిలిచిపోగా ప్రపంచమే స్తంభించినంతగా మారిపోయింది. ఇంతలా ప్రజలతో అనుసంధానమైన ఫేస్‌బుక్ త్వరలో తన పేరును మార్చుకుంటోంది. ఈనెల 28న ఫేస్‌బుక్ వార్షిక సమావేశం జరగనుంది. ఈ భేటీలో ఆ సంస్థ సీఈవో మార్క్…
ఇప్పుడంతా సోషల్ మీడియా ట్రెండ్.. ప్రతీ స్మార్ట్‌ఫోన్‌లో సోషల్ మీడియా యాప్స్ ఉండాల్సిందే.. చిన్న నుంచి పెద్ద అనే తేడా లేకుండా అంతా ఎక్కువ సమయం సోషల్ మీడియాపైనే గడుపుతున్నారంటే అతిశయోక్తి కాదు.. కానీ, సోమవారం సోషల్ మీడియాలో కీలక భూమిక పోషిస్తున్న ఫేస్‌బుక్, వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్ స్తంభించిపోయాయి.. తరచూ వాట్సప్ చెక్ చేసుకుంటూ.. ఫేస్‌బుక్‌లో యాక్టివ్‌గా ఉంటూ.. ఇన్‌స్టాలో పోస్టులు పెట్టేవారికి ఈ పరిణామం చాలా ఇబ్బంది కరంగా మారింది… మళ్లీ మళ్లీ ఆ యాప్స్…
సోమవారం రాత్రి 9 గంటల నుంచి మంగళవారం ఉదయం 4 గంటల వరకు ఫేస్‌బుక్ డౌన్ అయింది. పలు సమస్యల కారణంగా ఫేస్ బుక్ ఓపెన్ కాలేదు. ఫేస్‌బుక్‌తో పాటుగా దాని అనుబంధ సంస్థలైన ఇన్‌స్టాగ్రామ్, వాట్సప్‌లు కూడా ఓపెన్ కాలేదు. దీంతో ప్రపంచం మొత్తం షాక్ అయింది. ఎందుకు ఇలా జరిగిందో తెలియన తికమకపడ్డారు. చాలామంది ట్విట్టర్‌లో పోస్టులు, మీమ్స్ పెట్టారు. అయితే, ఈరోజు ఉదయం 4 గంటల సమయంలో తిరిగి రిస్టోర్ అయింది. …