మరియమ్మ లాకప్ డెత్ కేసులో తెలంగాణ హై కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. మరియమ్మ మృతి పై సీబీఐ దర్యాప్తు అవసరం లేదని స్పష్టం చేసింది హై కోర్టు. రాష్ట్ర పోలీసుల దర్యాప్తు సరైన రీతిలోనే.. జరుగుతోందని.. ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. మరియమ్మ కస్టోడియల్ మృతి పై విచారణ ముగించిన హై కోర్టు.. ఈ కేసులో తార్కిక ముగింపు తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని అభిప్రాయపడింది. మరియమ్మ కస్టోడియల్ మృతి పై ప్రస్తుత దశలో ఎలాంటి చర్యలు అవసరం…
దొంగతనం కేసులో పోలీసులు మరియమ్మ అనే మహిళను తీసుకెళ్లారు. అనంతరం ఆమెను విచారణ పేరుతో చిత్రహింసలకు గురి చేసి చంపేసినట్లు ఆరోపనలు రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా మరియమ్మ లాకప్‌డెత్ కేసు సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో మరియమ్మ లాకప్‌డెత్‌పై హైకోర్టు ఈ రోజు విచారణ చేపట్టనుంది. మరియమ్మ మృతిపై గతంలోనే హైకోర్టుకు మెజిస్ట్రేట్ నివేదిక సమర్పించారు. అయితే కేసు పూర్తి వివరాలను అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ అప్పగించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో కేసు పూర్తి వివరాలను…
దొంగతనం కేసులో పోలీసులు తీసుకెళ్లి కొట్టడంతో పోలీస్ స్టేషన్‌లోనే మరియమ్మ మృతి చెందింది. అయితే మరియమ్మ లాకప్ డెత్ పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో పీయూసీఎల్ పిల్ పై సీజే జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ ఎ.రాజశేఖర్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. మరియమ్మ లాకప్ డెత్ సీబీఐకి అప్పగించదగిన కేసని హైకోర్టు అభిప్రాయపడింది. ఈనెల 22న విచారణకు రావాలని సీబీఐ ఎస్పీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అంతేకాకుండా మరియమ్మ మృతిపై…