Marital Rape: వైవాహిక అత్యాచారాలను నేరంగా పరిగణించాల్సిన అవసరం లేదని కేంద్రం సుప్రీంకోర్టుకి తెలిపింది. ఎందుకుంటే తగినన్ని శిక్షాణాత్మక చర్యలు రూపొందించబడ్డాయని పేర్కొంది. వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించడం సుప్రీంకోర్టు పరిధిలో లేదని కేంద్రం తెలిపింది. వైవాహిక అత్యాచారం అనేది చట్టబద్ధమైన సమస్య కన్నా సామాజిక సమస్య అని,
Uttarakhand HC: సెక్షన్ 375 ప్రకారం వైవాహిక అత్యాచారాన్ని నేరం కాదని, ఐపీసీ సెక్షన్ 377 ప్రకారం భార్యతో అసహజ శృంగారం చేసినందుకు భర్తను దోషిగా నిర్ధారించలేమని ఉత్తరాఖండ్ హైకోర్టు ఇటీవల తీర్పు చెప్పింది.
Pakistan: పాకిస్తాన్ పూర్తిగా ఇస్లామిక్ దేశం, అక్కడి చట్టాలు కూడా ఇస్లామిక్ చట్టాలక అనుగుణంగానే ఉంటాయి. మరోవైపు అక్కడ స్త్రీలకు, వారి హక్కులకు పెద్దగా ప్రాముఖ్యత ఉండదు. ఇక పెళ్లి తర్వాత స్త్రీని అనేది కేవలం ఒక సొత్తుగానే భావిస్తుంటారు. కొట్టినా, తిట్టినా, తమకు ఇష్టం లేకుండా సెక్స్ చేసినా కూడా పాక్ చట్టాల్లో శిక్షలు విధించే సెక్షన్లు చాలా తక్కువ.
Gujarat High Court : అత్యాచారం తీవ్రమైన నేరమని గుజరాత్ హైకోర్టు పేర్కొంది. బాధితురాలి భర్తే చేసినాసరే అది నేరమే. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో వైవాహిక అత్యాచారం చట్టవిరుద్ధంగా పరిగణించబడుతుందని హైకోర్టు పేర్కొంది.
భార్యతో బలవంతపు శృంగారం నేరమా? మారిటల్ రేప్ (వైవాహిక అత్యాచారం)ని నేరంగా పరిగణించాలా? అనే విషయం ఢిల్లీ హైకోర్టు భిన్న తీర్పును వెలువరించింది.. భార్యతో బలవంతపు శృంగారం నేరమే అవుతుందని ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనానికి నేతృత్వం వహిస్తున్న జస్టిస్ రాజీవ్ షక్దేహర్ ఆదేశాలు ఇచ్చారు. అయితే, బెంచ్‌లోని మరో న్యాయమూర్తి జస్టిస్ హరిశంకర్ మాత్రం ఆ ఆదేశాలతో విభేధించారు.. రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14, 19, 21లను సెక్షన్ 375(మినహాయింపు 2) ధిక్కరిస్తుందనడానికి ఎలాంటి మద్ధతు కనిపించడం…
కర్ణాటక హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వివాహం పేరుతో భార్యలపై భర్తలు లైంగిక దాడులకు పాల్పడటంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కర్ణాటకకు చెందిన ఒక మహిళ తన భర్త లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపిస్తూ హైకోర్టును ఆశ్రయించింది. తన కుమార్తె ముందే భర్త లైంగిక దాడికి పాల్పడుతున్నాడని ఆమె ఆరోపించింది. ఈ కేసుకు సంబంధించి బుధవారం కోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా భర్త కూడా మనిషేనని.. మనిషి లైంగిక దాడి ఎక్కడ చేసినా అది…
వైవాహిక జీవితంలో బలవంతపు శృంగారాన్ని నేరంగా పరిగణించాలంటూ దాఖలైన పిటిషన్లపై తీర్పును రిజర్వ్‌లో ఉంచింది ఢిల్లీ హైకోర్టు. మరింత గడువు కోరుతూ.. పిటిషన్ విచారణ వాయిదా వేయాలన్న కేంద్రం విజ్ఞప్తిని తిరస్కరించింది హైకోర్టు.. అయితే, పిటిషన్లపై స్పందించేందుకు సమయం కావాలని కోరారు సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. అన్ని రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల సీఎస్‌లకు ఫిబ్రవరి 10న అభిప్రాయ సేకరణకు సమాచారం అందించామని, అయితే, ఇంకా స్పందన రాలేదని కోర్టుకు తెలిపారు. కానీ, కేంద్రం విజ్ఞప్తిని తోసిపుచ్చింది…