ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఎడ్జ్‌బాస్టన్ టెస్టు మ్యాచ్‌లో భారత్ పట్టు బిగించింది. ఇంగ్లండ్ ముందు 608 పరుగుల భారీ లక్షాన్ని ఉంచిన టీమిండియా.. ఇప్పటికే మూడు వికెట్లు తీసి విజయం దిశగా సాగుతోంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలవాలంటే ఈ రోజు 536 పరుగులు చేయాలి. ఇప్పటికే మూడు వికెట్లు కోల్పోయిన ఇంగ్లీష్ జట్టు.. ఆచితూచి ఆడి డ్రా చేసుకుంటుందా? లేదా తమ ‘బజ్‌బాల్’ ఆటనే కొనసాగిస్తుందా? అని అందరూ ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐదవ రోజు ఆటపై…