హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఛలానాల క్లియరెన్స్ కొనసాగుతోంది. పెండింగ్ ఛలాన్‌ల కోసం తెలంగాణ పోలీస్ శాఖ ఇచ్చిన రాయితీలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. దీంతో మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం సమకూరింది. సుమారు 1.2 కోట్ల పెండింగ్ ఛలానాల ద్వారా రూ.112.98 కోట్లు జమ అయ్యాయి. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇప్పటి వరకు 63 లక్షల ఛలాన్‌లు క్లియర్ కాగా.. వీటి ద్వారా రూ.49.6 కోట్లు వాహనదారులు చెల్లించారు.…
తిరుమల వెళ్లే భక్తుల కోసం టీటీడీ కీలక సమాచారం విడుదల చేసింది. ఈనెల 20న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో ఆర్జిత సేవా టిక్కెట్లను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన ఆర్జిత సేవా టిక్కెట్లను ఈనెల 22 వరకు బుక్ చేసుకునేందుకు గడువు విధించినట్లు తెలిపింది. ఆన్‌లైన్ ఎలక్ట్రానిక్ డిప్ విధానంలో టిక్కెట్లను కేటాయిస్తామని టీటీడీ వివరించింది. ఈనెల 22న టిక్కెట్లు పొందిన వారికి వివరాలు పంపిస్తామంది. ఈనెల 20న ఆర్జిత…