ఆయన సైకిల్ దిగి కమలదళంలో చేరారు. అక్కడా ఇమడలేక బయటకొచ్చేశారు ఆ మాజీ ఎమ్మెల్యే. కాంగ్రెస్ గూటికి చేరేందుకు సిద్ధమైనా.. ఎవరో అడ్డుపుల్ల వేశారట. ఇంతకీ ఎవరా మాజీ ఎమ్మెల్యే? ఆయన్ని అడ్డుకుంటోంది ఎవరు? 12న కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు? మరాఠి చంద్రశేఖర్ అలియాస్ ఎర్ర శేఖర్. జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే. మహబూబ్‌నగర్ జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు. బీజేపీకి గుడ్‌బై చెప్పాక.. కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 12న మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగే నిరుద్యోగ…