ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్ జిల్లాలో మావోయిస్టులకు, పోలీస్ బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు పార్టీ అగ్రనేత, కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు (70) అలియాస్ బసవరాజు మృతి చెందారు. ఈ ఎన్‌కౌంటర్‌లో కేశవరావుతో పాటు 27 మంది మావోయిస్టులు మృతి చెందారు. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ఇన్‌ఛార్జ్ మధు, మావోయిస్టు పత్రిక జంగ్ ఎడిటర్ నవీన్ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారు. ఎన్‌కౌంటర్‌లో మరణించిన నంబాల కేశవరావు పూర్తి డీటెయిల్స్ ఓసారి చూద్దాం.…