మావోయిస్టు అగ్రనేత, పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న లొంగిపోయారు. ఆశన్నతో పాటు 208 మంది మావోయిస్టులు ఛత్తీస్‌గఢ్ సీఎం, హోంమంత్రి సమక్షంలో లొంగిపోయారు. మావోయిస్టులు అందరూ సీఎం విష్ణుదేవ్ సమక్షంలో ఆయుధాలను అప్పగించారు. ఆశన్న బీజాపూర్ మావోయిస్టు కేంద్రకమిటీ సభ్యుడుగా పని చేశారు. లొంగుబాటు నేపథ్యంలో ఆశన్న సహచరులను ఉద్దేశించి చివరి ప్రసంగం చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆయుధాలను వదిలిపెడుతున్నాం అని, ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీలో ఉండలేమన్నారు. ‘ఎవరికి వారే తమ…