మెదక్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఏడు పాయల ఆలయం గత ఎనిమిది రోజులుగా జలదిగ్బంధంలోనే ఉంది. సింగూరు ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడంతో ఆలయం ఎదుట 8 రోజులుగా మంజీరా నది పరవళ్లు తొక్కుతోంది.
Edupayala Temple: మెదక్ జిల్లా ఏడుపాయల వనదుర్గామాత ఆలయం ఇంకా జలదిగ్బంధంలో ఉంది. భారీ వర్షాల కారణంగా సింగూరు ప్రాజెక్టు రెండు గేట్లను అధికారులు ఎత్తివేశారు.
మన దేశంలో నదులను కూడా దేవతలుగా పూజిస్తారు. అందుకే పన్నెండేళ్ల కోసారి పుష్కరాల పేరుతో ఘనంగా వేడుకలను నిర్వహించి.. నదీమ తల్లిని పూజిస్తారు. పుష్కరాలతో పాటు కుంభమేళాను కూడా నిర్వహిస్తారు. సంగారెడ్డి జిల్లాలో మంజీరా కుంభమేళా సోమవారం ప్రారంభమైంది.
మెదక్ జిల్లాలోని ఏడుపాయల వన దుర్గ మాత ఆలయం వద్ద వరద నీరు ప్రవహిస్తోంది. జల దిగ్బంధంలోకి ఏడు పాయల ఆలయం వెళ్లింది. వరద నీరు అమ్మవారి గర్భగుడిలోకి ప్రవేశించాయి. అమ్మవారి పాదాలను తాకుతూ మంజీరానది ప్రవహిస్తుంది.
తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. దీంతో.. వాగులు వంకలు, ప్రాజెక్లులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి… ఎగువన కురిసిన వర్షాలకు సింగూరు ప్రాజెక్టు నిండుకుండలా మారడంతో గేట్లు ఎత్తివేశారు అధికారులు… సింగూరు ప్రాజెక్ట్ నాలుగు గేట్లను ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేయడంతో.. మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తోంది.. దీంతో.. మెదక్ జిల్లాలోని ఏడుపాయల వన దుర్గ మాత ఆలయం జలదిగ్బంధంలోకి వెళ్లిపోయింది… ఆలయంలోకి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో.. ఉత్సవ విగ్రహానికి గోపురం వద్ద పూజలు నిర్వహించారు.. ఆలయ ప్రాంగణంలో..…