Manish Sisodia Bail: మనీష్ సిసోడియా సుప్రీంకోర్టు నుండి బెయిల్ పొందారు. ఇప్పుడు జైలు నుండి బయటకు రానున్నారు. ఈ సాయంత్రానికి సిసోడియా జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఢిల్లీ మద్యం కుంభకోణంలో అవినీతి, మనీలాండరింగ్ కేసుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ నేత, మాజీ మంత్రి మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు నేడు విచారించనుంది.
మద్యం పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టనుంది. సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో ప్రచురించిన కారణాల జాబితా ప్రకారం.. న్యాయమూర్తులు బీఆర్ గవాయ్, కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసుపై నేడు విచారణను పునఃప్రారంభించనుంది.
ఎక్సైజ్ పాలసీ కుంభకోణానికి సంబంధించిన అవినీతి కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు మరోసారి నిరాశే ఎదురైంది. ఆయనకు జ్యుడీషియల్ కస్టడీని మరోసారి పొడిగించింది రౌస్ అవెన్యూ కోర్టు.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆప్ నేత, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని ట్రయల్ కోర్టు పొడిగించింది. జూలై 15 వరకు రిమాండ్ పొడిగిస్తూ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మాజీ డిప్యూటీ సీఎం, ఆప్ నేత మనీష్ సిసోడియాకు హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టేసింది. సీబీఐ, ఈడీ దర్యాప్తు చేస్తున్న కేసుల్లో బెయిల్ ఇవ్వాలని సిసోడియా కోరారు.
Swati Maliwal: రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌పై సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో దాడి జరగడం సంచలనంగా మారింది. కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్ తను చెంపపై ఏడెనిమిది సార్లు కొట్టాడని, తన కడుపులో, ఛాతిపై తన్నాడని ఆమె ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారం ఎన్నికల ముందు ఆప్‌కి ఇబ్బందికరంగా మారింది.
Manish Sisodia : మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు ఆయనకు పెద్ద ఊరటనిచ్చింది. వారానికి ఒకసారి భార్యను కలిసేందుకు కోర్టు అనుమతించింది.
ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఎన్నికల ప్రచారం కోసం మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టులో ఈరోజు విచారణ జరగగా కోర్టు తన నిర్ణయాన్ని ఏప్రిల్ 30వ తేదీకి రిజర్వ్ చేసింది.