ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మాజీ డిప్యూటీ సీఎం, ఆప్ నేత మనీష్ సిసోడియాకు హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టేసింది. సీబీఐ, ఈడీ దర్యాప్తు చేస్తున్న కేసుల్లో బెయిల్ ఇవ్వాలని సిసోడియా కోరారు. కానీ ధర్మాసనం తిరస్కరించింది. మనీష్ సిసోడియా దాఖలు చేసిన ఇది రెండో బెయిల్ పిటిషన్. సీబీఐ అరెస్టు చేసిన తర్వాత 2023 ఫిబ్రవరి 26 నుంచి సిసోడియా కస్టడీలో ఉన్నారు. ఆ తర్వాత, మార్చి 9, 2023న ఈడీ అరెస్టు చేసింది. అయితే అనారోగ్యంతో ఉన్న భార్యను కలుసుకునేందుకు మాత్రం గతంలో సిసోడియాకు కోర్టు అనుమతినిచ్చింది.
ఇది కూడా చదవండి: CM Revanth Reddy: మనవడి మొక్కు.. కుటుంబ సమేతంగా తిరుమలకు సీఎం రేవంత్ రెడ్డి
లిక్కర్ పాలసీ కేసులో అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లుగా ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. కొంతమందికి లాభదాయకంగా పాలసీని రూపొందించినట్లుగా తెలిపింది. కొంతమంది వ్యక్తులకు ప్రయోజనం చేకూర్చే భాగంలో అవినీతికి పాల్పడినట్లు న్యాయస్థానం పేర్కొంది.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఇప్పటికే పలువురు అరెస్ట్ అయ్యారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత.. ఇంకా తీహార్ జైల్లోనే ఉన్నారు. ఆమెకు ఇంకా బెయిల్ లభించలేదు. ఇక ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా మార్చి 21న అరెస్ట్ అయ్యారు. అనంతరం తీహార్ జైలుకు తరలించారు. అయితే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడిగా ప్రచారం చేసేందుకు జూన్ 1 వరకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. తిరిగి జూన్ 2న సరెండర్ కావాలని ఆదేశించింది.
ఇది కూడా చదవండి: Brain Tumor Surgery: కనుబొమ్మల ద్వారా బ్రెయిన్ ట్యూమర్ కోసం కీహోల్ సర్జరీ..