Swati Maliwal: రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌పై సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో దాడి జరగడం సంచలనంగా మారింది. కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్ తను చెంపపై ఏడెనిమిది సార్లు కొట్టాడని, తన కడుపులో, ఛాతిపై తన్నాడని ఆమె ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారం ఎన్నికల ముందు ఆప్‌కి ఇబ్బందికరంగా మారింది. మరోవైపు ఈ ఘటనపై కేజ్రీవాల్ ఇప్పటి వరకు మౌనంగా ఉన్నారు. మొత్తం వ్యవహారమంతా బీజేపీ వర్సెస్ ఆప్‌గా మారింది. బీజేపీ కేజ్రీవాల్ మౌనాన్ని ప్రశ్నిస్తోంది. నిందితుడికి అండగా నిలుస్తున్నాడని ఆప్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ కేసులో నిందితుడిగా పేర్కొన్న బిభవ్ కుమార్‌ని శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు, కోర్టు 5 రోజుల పోలీస్ కస్టడీకి పంపింది. మరోవైపు నిందితుడి ఫోన్ ఫార్మాట్ చేశాడని, సీఎం నివాసంలోని సీసీటీవీ ఫుటేజీ ఖాళీగా ఉండని పోలీస్ వర్గాలు చెబుతున్నాయి.
Read Also: PM Modi: సోనియా గాంధీ రాయ్‌బరేలిని వదిలేసి, ఇప్పుడు కొడుకు కోసం ఓట్లు అడుగుతున్నారు..
ఇదిలా ఉంటే మరోసారి తనపై జరిగిన దాడి గురించి స్వాతి మలివాల్ స్పందించారు. ‘‘నిర్భయకు న్యాయం చేయాలని మేమంతా వీధుల్లోకి వచ్చాం. 12 ఏళ్ల తర్వాత సీసీటీవీ ఫుటేజీని అదృశ్యం చేసి, ఫోన్‌ని ఫార్మాట్ చేసిన నిందితులను రక్షించడానికి మళ్లీ వీధుల్లోకి వచ్చామా..?’’ అని ఆమె ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ‘‘ మనీష్ సిసోడియా అక్కడ ఉండి ఉంటే, బహుశా నాకు ఇలా జరిగేది కాదు’’ అని ఆమె అన్నారు. మే 13న సీఎం కేజ్రీవాల్ నివాసంలో తనపై జరిగిన దాడికి సంబంధించిన సీసీటీవీ కెమెరా ఫుటేజీ అదృశ్యమయ్యాయని, ఎడిట్ చేసిన వీడియోలు విడుదల అవుతున్నాయని స్వాతి మలివాల్ శనివారం రాత్రి పేర్కొన్నారు.

Swati Maliwal Assault
‘‘మొదట నన్ను బిభవ్ దారుణంగా కొట్టాడు. అతను నన్ను చెంపదెబ్బ కొట్టాడు, తన్నాడు. నేను విడిపించుకుని 112కి కాల్ చేసినప్పుడు, అతను బయటికి వెళ్లి, సెక్యూరిటీ సిబ్బందిని పిలిచి వీడియో చేయడం ప్రారంభించాడు. నేను బిభవ్ నన్ను దారుణంగా కొట్టాడని సెక్యూరిటీకి చెప్పాను.’’ ఆమె పేర్కొన్నారు. వీడియోలో పొడవైన భాగాన్ని ఎడిట్ చేసి, 50 సెకన్ల వీడియో మాత్రమే విడుదల చేశారని అన్నారు. ఇప్పుడు ఫోన్ ఫార్మాట్ చేయబడింది, పూర్తి వీడియో తొలగించబడింది, సీసీటీవీ ఫుటేజ్ అదృశ్యమైంది, ఇది కుట్రకు పరాకాష్ట అని ఆమె ట్వీట్ చేశారు.
किसी दौर में हम सब निर्भया को इंसाफ़ दिलाने के लिए सड़क पर निकलते थे, आज 12 साल बाद सड़क पर निकले हैं ऐसे आरोपी को बचाने के लिए जिसने CCTV फुटेज ग़ायब किए और Phone format किया?
काश इतना ज़ोर मनीष सिसोदिया जी के लिए लगाया होता। वो यहाँ होते तो शायद मेरे साथ इतना बुरा नहीं होता! pic.twitter.com/kXAAMLgPcg
— Swati Maliwal (@SwatiJaiHind) May 19, 2024