Mangli: ప్రముఖ జానపద గాయని మంగ్లీ సైబర్ నేరగాళ్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పాటను ఉద్దేశిస్తూ, అలాగే ఎస్టీ వర్గాన్ని కించపరుస్తూ సోషల్ మీడియాలో అసభ్యకరమైన కామెంట్స్ చేసిన ఓ వ్యక్తిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్.ఆర్.నగర్ పోలీస్ స్టేషన్‌లో మంగ్లీ లిఖితపూర్వక ఫిర్యాదు దాఖలు చేశారు. ఇటీవల విడుదలైన తన పాట “బాయిలోనే బల్లి పలికే…” పై ఒక వ్యక్తి సోషల్ మీడియాలో నీచమైన, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారని ఆమె తెలిపారు.…