Mangli: ప్రముఖ జానపద గాయని మంగ్లీ సైబర్ నేరగాళ్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పాటను ఉద్దేశిస్తూ, అలాగే ఎస్టీ వర్గాన్ని కించపరుస్తూ సోషల్ మీడియాలో అసభ్యకరమైన కామెంట్స్ చేసిన ఓ వ్యక్తిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్.ఆర్.నగర్ పోలీస్ స్టేషన్‌లో మంగ్లీ లిఖితపూర్వక ఫిర్యాదు దాఖలు చేశారు. ఇటీవల విడుదలైన తన పాట “బాయిలోనే బల్లి పలికే…” పై ఒక వ్యక్తి సోషల్ మీడియాలో నీచమైన, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారని ఆమె తెలిపారు.
Weather Report : నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం, ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాల ఆందోళన!
ఆ వ్యక్తి కేవలం పాటపైనే కాకుండా, తమ ఎస్టీ వర్గాన్ని (Scheduled Tribe) కించపరిచే విధంగా, వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడారని కంప్లైంట్‌లో పేర్కొన్నారు. పరువు నష్టం కలిగించేలా, సామాజిక వర్గాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన ఆ వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మంగ్లీ పోలీసులను కోరారు.
Nothing Phone 3a Lite: 5000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో.. నథింగ్ ఫోన్ 3a లైట్ 5G ఫోన్ రిలీజ్
మంగ్లీ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆ వ్యక్తి ఎవరు, ఎక్కడి నుండి ఈ కామెంట్స్ చేశారనే దానిపై టెక్నికల్ ఆధారాలను సేకరించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. నిజానికి ఎప్పటికప్పుడు మంగ్లీ వివాదంలో చెప్పుకుంటూ ఉంటుంది. కానీ ఆశ్చర్యకరంగా ఈసారి మంగ్లీ తన పాట మీద ఎవరో కామెంట్ చేశారు అంటూ ఫిర్యాదు చేయడం మాత్రం ఆసక్తికరంగా మారింది. నిజానికి మంగ్లీ సినిమాలో పాటల కంటే ముందుగానే ఈ ఫోక్ సాంగ్స్ పాడుతూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ఆమెకు సినిమా అవకాశాలు కూడా రావడంతో సినిమాల్లో కూడా పాటలు పాడుతూ వస్తోంది.