Mangaluru Autorickshaw Blast: మంగళూరు ఆటోరిక్షా పేలుడు కేసులో ‘‘యాక్ట్ ఆఫ్ టెర్రర్’’గా పేర్కొన్నారు కర్ణాటక పోలీసులు. ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. మంగళూర్ నగరంలో శనివారం ఆటోరిక్షాలో పేలుడు సంభవించింది. అయితే ఇది ప్రమాదవశాత్తు పేలిన సంఘటన కాదని.. తీవ్ర నష్టం కలిగించే ఉద్దేశం ఇందులో ఉందని రాష్ట్ర డీజీపీ ప్రవీణ్ సూద్ ఆదివారం అన్నారు. ఇందులో ఉగ్రకుట్ర ఉన్నట్లుగా ఆయన ధృవీకరించారు. ఈ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థలకు కర్ణాటక పోలీసులు సహకరిస్తున్నారని…