Teacher elopes with student: ఉపాధ్యాయ వృత్తికే కళంకం తెచ్చాడు ఓ వ్యక్తి. ట్యూషన్‌కి వచ్చే విద్యార్థినితో పారిపోయిన ఘటన కర్ణాటక రాష్ట్రంలోని మాండ్యా జిల్లాలో జరిగింది. ఆరు వారాల తర్వాత మైనర్ బాలికను టీచర్ నుంచి పోలీసులు రక్షించారు. రెండు నెలల క్రితం మైనర్ విద్యార్థినితో పారిపోయిన ట్యూషన్ టీచర్‌ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు బుధవారం తెలిపారు.
Hanuman Flag: కర్ణాటకలో మరో వివాదం చెలరేగింది. మాండ్యా జిల్లాలో అధికారులు హనుమాన్ జెండాను తొలగించడం వివాదాస్పదమైంది. జిల్లాలోని కెరగోడు గ్రామంలో హనుమాన్ జెండాను తొలగించడం ఇప్పుడు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్‌గా మారింది. గ్రామస్తులంతా ప్రభుత్వానికి, అధికార కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నిరసన, ఆందోళనలకు దిగారు. నిన్న ప్రారంభమైన ఈ ఆందోళనలు, ఈ రోజు కూడా కొనసాగించేందు ప్లాన్ చేశారు.
Karnataka: కర్ణాటక మాండ్యా జిల్లాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలోని కేరగోడు గ్రామంలో ప్రజలు 108 అడుగుల ఎత్తున హనుమాన్ జెండాను ఆవిష్కరించారు. అయితే, ఈ రోజు తెల్లవారుజామున స్థానిక అధికారులు ఈ జెండాను తొలగించడం ఉద్రిక్తతలకు దారి తీసింది. కాషాయ జెండాను ఎగరేసినందుకు కొందరు ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడి పోలీసులు బలవంతంగా జెండాను తీయించారు.
Karnataka: అత్యాచారానికి గురైన టీనేజ్ బాలిక, తాను గర్భం దాల్చాలని తెలుసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన కర్నాటకలోని మాండ్యా జిల్లాలో జరిగింది. 15 ఏళ్ల బాలిక గర్భవతి అని తెలియగానే ఈ నెల 24న ఆత్మహత్య చేసుకుంది. గతేడాది డిసెంబర్‌లో లైంగిక వేధింపులకు గురైనట్లు బాధితురాలు ఆరోపించింది. అయితే, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. నిందితుడు బాలిక ఇంటి పొరుగున ఉండే వ్యక్తిగా గుర్తించారు. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడు.
Karnataka: తల్లిదండ్రులు పిల్లల ఎదుగుదలను చూడాలని కలలు కంటారు. తమను మించిన వాళ్లు కావాలని కోరుకుంటారు. తాజాగా కర్ణాటకలో ఓ యువతి అదే చేతి చూపించింది. తండ్రి బాధ్యతలను తాను స్వీకరించింది, ఇన్నాళ్లు పోలీస్ ఇన్స్పెక్టర్ గా తండ్రి పనిచేసిన అదే పోలీస్ స్టేషన్ లో కూతురికి పోస్టింగ్ వచ్చింది. స్వయంగా ఆయనే తన కూతురికి బాధ్యతలు అప్పగించారు.
కర్నాటకలో మరోసారి ఉద్రికత్త వాతావరణం ఏర్పడింది. ఇటీవల కాలంలో కర్నాటకలో వరసగా మతపరమైన ఉద్రిక్తతలు చెలరేగుతున్నాయి. ఓ వైపు దేశంలో జ్ఞాన్వాపి మసీదు వివాదం చెలరేగుతున్న సంగతి తెలిసిందే. మరో వైపు ఉత్తర్ ప్రదేశ్ లోని మథుర షాహీ ఈద్గా మసీదు విషయం కూడా ప్రస్తుత కోర్టు లో ఉంది. ఇలాంటి వివాదాల మధ్య కర్నాటకలో ఇలాంటి వివాదాలే తెరపైకి వస్తున్నాయి. కర్నాటక మాండ్యా జిల్లా శ్రీరంగ పట్నంలోని జామియా మసీదు ప్రస్తుతం వివాదాస్పదం అవుతోంది. కొన్ని…
డబ్బు.. ప్రపంచాన్ని నడిపిస్తోంది.. కాదు కాదు శాసిస్తోంది. రక్త సంబంధాలు, మానవత్వం మరిచి మృగాల్లా ప్రవర్తిస్తున్నారు. ఆస్తికోసం కన్నబిడ్డలు కన్న తల్లిదండ్రులను హతమారుస్తున్నారు. తాజాగా ఇద్దరు కొడుకులు.. ఆస్తి గొడవల్లో కన్నతండ్రిని అతి దారుణంగా పొడిచి చంపారు. ఈ దారుణ ఘటన కర్ణాటకలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. మండ్య జిల్లాలోని శ్రీరంగ పట్టణం తాలూకాలోని కరెమేగళకొప్పలు గ్రామంలో మరికాళయ్య కుటుంబంతో సహా నివసిస్తున్నాడు. అతడికి ఇద్దరు కొడుకులు శశికుమార్, రాజేష్. ఇద్దరు కొడుకులకు పెళ్లిళ్లు చేసి ఒక…
కర్ణాటక రాజధాని బెంగళూరులో మళ్లీ వింత శబ్దాలు భయపెడుతున్నాయి. గతంలో కూడా ఇలాంటి వింత శబ్దాలు రావడంతో హిందుస్తాన్ ఎరోనాటిక్స్ లిమిటెడ్ క్లారిటీ ఇచ్చింది. యుద్ధ విమానాన్ని పరీక్షిస్తున్నప్పుడు వచ్చిన శబ్దంగా చెప్పింది. గతేడాది మేలో వచ్చిన శబ్దాలకు క్లారిటీ ఇచ్చిన హెచ్ఏఎల్, అదే ఏడాది జూన్‌లో వచ్చిన శబ్దాలకు క్లారిటీ ఇవ్వలేదు. ఆ శబ్దాలకు ప్రత్యేక కారణాలు ఏవీ లేవని చెప్పింది. Read: నవంబర్ 27, శనివారం దినఫలాలు… కాగా, ఇప్పుడు మరోసారి బెంగళూరు…