ఆంధ్రప్రదేశ్‌లో హెల్మెట్ల తప్పనిసరిగా ధరించటాన్ని పోలీసులు అమలు చేయకపోవటంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది ఏపీ హైకోర్టు.. ఈ విషయాన్ని పోలీసులు సీరియస్‌గా తీసుకోవటంలేదని.. అసలు పట్టించుకోవడంలేదన్నారు న్యాయమూర్తి.. అయితే, ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ నెల వరకు 667 మంది హెల్మెట్ ధరించక పోవడం వల్లే రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందారని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు పిటిషనర్.. దీనిపై స్పందించిన హైకోర్టు.. ఈ మృతులకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించింది.