(అక్టోబర్ 8న మంచు లక్ష్మి బర్త్ డే) నటి, నిర్మాత, నిర్వహాకురాలుగా మంచు లక్ష్మి సాగిన తీరే వేరు. తెలుగు చిత్రసీమలో తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకొని నటనలో అడుగుపెట్టిన అమ్మాయిలు చాలా కొద్దిమందే కనిపిస్తారు. వారిలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు మంచు లక్ష్మి. తండ్రి మోహన్ బాబు తనదైన కంచుకంఠంతో విలక్షణమైన పాత్రల్లో జనాన్ని విశేషంగా ఆకట్టుకున్నారు. అదే తీరున మంచు లక్ష్మి సైతం వరైటీ రోల్స్ తో నటనలో అలరించారు. మాతృభాష తెలుగులో నటించక…