మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ వద్ద తన జోరును కొనసాగిస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా కుర్ర హీరోలకు దీటుగా వరుస సినిమాలను లైన్‌లో పెడుతున్న ఆయన, 2026వ సంవత్సరాన్ని పూర్తిగా తన పేరు మీద లిఖించుకోవడానికి చిరంజీవి సిద్ధమయ్యారు. ఒకే ఏడాదిలో ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా మూడు భారీ చిత్రాలతో ప్రేక్షకులను అలరించడానికి ప్లాన్ చేయడం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. మెగా అభిమానులకు ఇది అసలైన పండగ లాంటి వార్త. 2026లో విడుదల కానున్న…
మెగాస్టార్ చిరంజీవి హీరోగా, ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ అనే టైటిల్‌తో రిలీజ్ అవ్వబోతున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా నయనతార నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కొన్ని షెడ్యూల్స్ పూర్తికాగా, మరికొన్ని షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే, ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ మధ్య ఈ సినిమా నుంచి ‘మీసాల పిల్ల’ అనే ఒక ప్రోమో రిలీజ్ చేశారు. ఈ ప్రోమోకి కాస్త మిక్స్‌డ్ రియాక్షన్…