Chiranjeevi : 2026..మెగాస్టార్ నామ సంవత్సరం!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ వద్ద తన జోరును కొనసాగిస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా కుర్ర హీరోలకు దీటుగా వరుస సినిమాలను లైన్‌లో పెడుతున్న ఆయన, 2026వ సంవత్సరాన్ని పూర్తిగా తన పేరు మీద లిఖించుకోవడానికి చిరంజీవి సిద్ధమయ్యారు. ఒకే ఏడాదిలో ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా మూడు భారీ చిత్రాలతో ప్రేక్షకులను అలరించడానికి ప్లాన్ చేయడం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. మెగా అభిమానులకు ఇది అసలైన పండగ లాంటి వార్త. 2026లో విడుదల కానున్న ఆ మూడు చిత్రాల వివరాలు ఇవే.
Also Read :TheRajaSaab : డార్లింగ్ ప్రభాస్ ‘రాజాసాబ్ పార్ట్ 2’ ఫిక్స్
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
2026వ సంవత్సరానికి గ్రాండ్ వెల్కమ్ చెబుతూ, సంక్రాంతి బరిలో మెగాస్టార్ నిలవనున్నారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘మన శంకర్ వరప్రసాద్ గారు’. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునేలా పూర్తిస్థాయి ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. 2026 జనవరిలో ఈ సినిమాను విడుదల చేయడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. మెగాస్టార్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో, ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సోషియో-ఫాంటసీ చిత్రం ‘#Vishwambhara’. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయినట్లు సమాచారం. ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ మరియు వీఎఫ్‌ఎక్స్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ అద్భుత దృశ్యకావ్యాన్ని 2026 వేసవి సెలవుల్లో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read :Ananya Nagalla : గులాబి కళ్ళు రెండు ముల్లు చేసి.. గుచ్చుతున్న అనన్య నాగళ్ళ
‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ (కె.ఎస్. రవీంద్ర) కాంబినేషన్‌లో మరో చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. ‘#ChiruBobby2’గా పిలవబడుతున్న ఈ ప్రాజెక్ట్ పనులు కూడా వేగవంతమయ్యాయి. సమాచారం ప్రకారం, ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ ఏడాది డిసెంబర్‌లో ప్రారంభం కానుంది. షూటింగ్ మొదలైన వెంటనే శరవేగంగా పూర్తి చేసి, 2026 చివరి నాటికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇలా 2026 ఆరంభంలో, మధ్యలో (వేసవి), మరియు చివరిలో.. ఇలా ఏడాది మొత్తం మూడు విభిన్నమైన చిత్రాలతో మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి సిద్ధమవుతున్నారు.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు