G20 Dinner: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జీ20 దేశాధినేతలకు శనివారం విందు ఇవ్వనున్నారు. అయితే ఈ విందుకు కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి ఆహ్వానం అందలేదని ఆయన కార్యాలయం తెలిపింది. ప్రతిపక్ష కాంగ్రెస్ అధ్యక్షుడిగా, రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా క్యాబినెట్ హోదా కలిగిని ఖర్గేకు ఆహ్వానించలేదు. క్యాబినెట్ మంత్రులు, ముఖ్యమంత్రులు, భారత ప్రభుత్వ కార్యదర్శులు, ఇతర అతిథులకు ఆహ్వానితుల జాబితాలో ఉన్నారు. మాజీ ప్రధానులైన డాక్టర్ మన్మోహన్ సింగ్, హెచ్‌డీ దేవెగౌడ కూడా అతిథుల లిస్టులో ఉన్నారు.
పశ్చిమబెంగాల్లో నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఏకంగా రూ.20 కోట్ల నగదు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దాడుల్లో బయటపడింది. ఇంత పెద్దమొత్తంలో పట్టుబడటం ఇటీవల కాలంలో ఇదే మొదటిసారి. పశ్చిమ బెంగాల్ త్రుణమూల్ కాంగ్రెస్ మంత్రి పార్థ ఛటర్జీ సన్నిహితురాలి ఇంటి నుంచి ఈ నగదును స్వాధీనం చేసుకుంది ఈడీ. మంత్రి పార్థ ఛటర్జీ సన్నిహితురాలు అర్పితా ముఖర్జీ ఇంటిపై శుక్రవారం ఈడీ దాడి చేసింది. అర్పితా ఇంట్లో నోట్లు గుట్టలు గుట్టలుగా బయటపడింది.